
Excessive Hunger: మనలో చాలా మందికి అతిగా తినే అలవాటు ఉంటుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఇతర అనారోగ్యాలకు దారి తీస్తున్నా ఇది మంచి అలవాటు మాత్రం కాదు. ఇది మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వారు చాటుమాటుగా ఏది పడితే అది తింటూ ఉంటారు. అతిగా తినడం అనేది చెడు అలవాటుగానే చూడాలి. ఏదైనా వ్యాధి లక్షణం వచ్చినా అతిగా ఆకలి వేయడం సహజమే.
అతిగా ఆకలి వేయడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. జీర్ణాశయ సమస్యలు, థైరాయిడ్, లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే కూడా ఆకలి అతిగా వేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి ఆకలి మంచి లక్షణం కాదని తెలుస్తోంది. అయినా ఎందుకో కొందరు తమ ఆశను చంపుకోలేక ఏది పడితే అది తినేస్తుంటారు. జిహ్వ చాపల్యాన్ని చంపుకోకుండా తింటుంటారు.

అతిగా ఆకలి ఉంటే వైద్యులను సంప్రదించి ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకుంటే మంచిది. అతి అనేది ఎందులో కూడా మంచిది కాదు. అది ఆకలి అయినా సరే అలాంటి ప్రభావం చూపుతుంది. ఆకలి త్వరగా వేయడం వల్ల నోటికి తాళం లేకుండా తింటూనే ఉంటాం. తిన్న తరువాత కనీసం మూడు గంటలైనా విరామం ఇవ్వాలి. అప్పుడే మనం తిన్నది జీర్ణం అయిపోతుంది.
అతి ఆకలి కోరిక పుడితే చాలు ఏదైనా తినాలనే అనిపిస్తుంది. దీంతో ఏది కనిపించినా దాన్ని లోపల వేయడమే చేస్తుంటారు. దీని వల్ల అనర్థాలు వస్తాయి. అతిగా తినాలనిపించడం కూడా ఓ జబ్బుగానే భావించాలి. తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ముదిరిపోయే ఇంకా అనేక ఇబ్బందులు తెస్తుంది. అందరు కూడా అతి ఆకలిని నిరోధించుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు మొగ్గు చూపాలి.