
Peanuts Benefits: ఇటీవల కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఎవరిని చూసినా హార్ట్ ఎటాక్ తో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. దీంతో ఆధునిక కాలంలో వంట నూనెల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనం వాడే వంట నూనెలు ఎంతో బాధలకు గురి చేస్తాయి. పల్లీలకు గుండెపోటుకు సంబంధం ఉందని కొందరు చెబుతుంటే అందులో నిజం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వంద గ్రాముల పల్లీల్లో 567 కేలరీలు శక్తి, 17 గ్రాముల్లో కార్బోహైడ్రేడ్లు, 25 గ్రాముల ప్రొటీన్లు, 45 గ్రాములు కొవ్వులు, 10 గ్రాముల ఫైబర్, ఫోలిక్ యాసిడ్లు ఉన్నాయి.
పల్లీల్లో మన ఆరోగ్యానికి పనికి వచ్చే కొవ్వు ఉంటుంది. ఇందులో ఫైటో స్టిరాల్ ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ ను రక్తంలో కలవకుడా చేస్తుంది. పల్లీల్లో ఉండే రసాయనాలు కలేయంలో ఉండే మలినాలను తొలగేలా చేస్తాయి. వ్యాయామాలు చేసే వారు వీటిని తీసుకుంటే మచి ఫలితం ఉంటుంది. పల్లీల్లో మనకు ఉపయోగపడే కొవ్వులే ఉంటాయి. చెడు కొవ్వును దూరం చేసే విధంగా ఇవి సాయపడతాయి. అందుకే పల్లీలు తీసుకోవడం వల్ల ఎలంటి దుష్ఫలితాలు ఉండవని తెలుసుకుని వీటిని తరచుగా తీసుకోవడం శ్రేయస్కరమే.
గర్భిణులు, బాలింతలు, బాలింతలు, వ్యాయామం చేసే వారికి పల్లీలు తీసుకోవడం వల్ల పోషకాలు లభిస్తాయి. పల్లీలు తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదులో వీటిని తీసుకోవడంతో ఆకలి త్వరగా వేయదు. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోరాదు. పల్లీలను తినడం వల్ల బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. అందుకే పల్లీలను తినడం వల్ల మనకు ఆరోగ్యమే కానీ నష్టం ఉండదు. ఈ నేపథ్యంలో పల్లీలను విరివిగా తినడం మంచిదే.

గుండెకు ఆరోగ్యం కలగాలంటే రక్తం గడ్డ కట్టకుండా చూడాలి. పల్లీల నూనె వాడటం వల్ల గుండె జబ్బుల ముప్పు ఉండదు. ఆ నూనెలో వేయించిన మసాలాలు, ఉప్పు, కారం చల్లుకుని తింటే ఇబ్బందులు వస్తాయి. ఇలా తింటే గుండెకు ఇబ్బందుల రావడం సహజమే. దీంతో పల్లీల వాడకం వల్ల ఎలాంటి కీడు ఉండదు. పల్లీలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవే తప్ప కష్టాలు తెచ్చేవి కావు. నానబెట్టిన పల్లీలను తినడం ద్వారా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే పల్లీలు ఔషధంగా ఉపయోగపడతాయి.