
Balagam OTT: ఇటీవల కాలం లో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించిన సినిమా ‘బలగం’. జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఈ సినిమా కేవలం 50 లక్షల గ్రాస్ వసూళ్లతో ప్రారంభం అయ్యి నేడు, 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.నిన్న కూడా ఈ చిత్రానికి దాదాపుగా కోటి 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా సగటున రోజుకి 70 లక్షలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుంది. ట్రేడ్ పండితులు ఈ సినిమాకి ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఇంత బ్లాక్ బస్టర్ రన్ నడుస్తున్న ఈ సమయం లో ఎవరైనా ఓటీటీ లో విడుదల చేసుకుంటారా.?, కానీ దిల్ రాజు నేటి నుండి ఈ చిత్రం ఓటీటీ లో విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు.
ఈ సినిమా ఈరోజు అర్థ రాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ మరియు సింప్లీ సౌత్ లో స్ట్రీమింగ్ కానుంది.ట్రేడ్ పండితులు దిల్ రాజు కి బుర్ర ఏమైనా చెడిపోయిందా అని పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పట్లో ఓటీటీ లోకి వదలకపొయ్యుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మరో పది నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉండేది.

అలాంటి అవకాశాన్ని దిల్ రాజు ఎందుకు వదులుకున్నాడో అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే దిల్ రాజు కి ముందు గా విడుదల చేస్తే ఫ్యాన్సీ అమౌంట్ ఇస్తామని అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆఫర్ ఇచ్చిందట. దాంతో దిల్ రాజు వెంటనే ఒప్పుకున్నాడు, అయితే ఓటీటీ లో వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వసూళ్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదని దిల్ రాజు నమ్ముతున్నాడట. మరి ఆయన నమ్మకం నిలుస్తుందో లేదో చూద్దాం.