https://oktelugu.com/

‘భారత్’లో డిసెంబర్ 3కు కరోనా వైరస్ మాయం..!

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. ఒకవైపు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు జరుగుతుండగా వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో కరోనా వైరస్ కు సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 11 కొత్త లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. Also Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది! కండరాల నొప్పులు, రుచి, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 21, 2020 / 08:24 PM IST
    Follow us on

    దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. ఒకవైపు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి పరిశోధనలు జరుగుతుండగా వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట్లో కరోనా వైరస్ కు సంబంధించి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 11 కొత్త లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

    Also Read : మాస్కు పెట్టుకోకుంటే కరోనా ఇలా సోకుతుంది!

    కండరాల నొప్పులు, రుచి, వాసన తెలియకపోవడం, ఆయాసం, జ్వరం, జలుబు, పొడి దగ్గు, కళ్లు ఎర్రబారడం, జుట్టు రాలిపోవడం తదితర లక్షణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా బారిన పడిన కొంతమంది రోగుల్లో ఎక్కిళ్లే ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. అయితే వేగంగా విజృంభిస్తున్న ఈ వైరస్ మన దేశంలో మరికొన్ని రోజుల్లో తగ్గుముఖం పట్టబోతుందని తెలుస్తోంది. ఇండియా ఔట్ బ్రేక్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

    సెప్టెంబర్ తొలివారానికి కేసుల సంఖ్య పెరుగుదల గరిష్ఠానికి చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. తొలి దశలో ముంబై, ఢిల్లీ నగరాల్లో భారీగా కేసులు నమోదు కాగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజా నివేదిక ప్రకారం వైరస్ ను ఎదుర్కొనే శక్తి భారతీయుల్లో క్రమంగా పెరుగుతోంది. చెన్నైలో అక్టోబర్ చివరి నుంచి వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ నివేదికలో వెల్లడైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యస్థాయి నగరాలపై దృష్టి పెట్టాలని ఈ నివేదిక వెల్లడించింది.

    Also Read : భలే ఐడియా.. పాముకు మాస్క్.. చూశారా ?