
Vinodhaya Sitham Movie Story: పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుందని, అది తమిళ సినిమా రీమేక్ అని ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహం అభిమానుల్లో నిన్న మొన్నటి వరకు ఉండేది, కానీ నేడు ఏకంగా రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్రారంభించేసుకుంది ఈ చిత్రం.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వినోదయ్యా సీతం’ అనే చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా,త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే విధంగా త్రివిక్రమ్ ఈ చిత్ర కథని మలిచాడట.
కథ విషయానికి వస్తే జీవితం లో ఎన్నో కళలు ఉన్న ఒక వ్యక్తి , కారు ప్రమాదం లో చనిపోతాడు,అప్పుడు ఆయనని పైకి తీసుకెళ్ళేందుకు ఒక దూత వస్తాడు.జీవితం లో ఎన్నో బాధ్యతలు మిగిలి ఉన్నాయి, దయ చేసి అవి పూర్తి చేసేంత వరకు తనకి సమయం ఇవ్వండి అని కోరడంతో, అతని కోరికని మన్నించి, తిరిగి అతని శరీరానికి ఆత్మని పంపించి కొంత సమయం ఇస్తాడు.ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితం లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి అనేదే స్టోరీ.

ఈ సినిమాని పూర్తిగా కమర్షియల్ ఫార్మటు లోకి మార్చి,పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఫైట్స్, ఎలివేషన్స్ పెట్టి ఎంతో అద్భుతంగా మలిచాడట త్రివిక్రమ్.కేవలం స్టోరీ పాయింట్ ని తీసుకొని కథ మొత్తాన్ని మార్చేసారట, కచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఈ ఏడాదిలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి.