Nita Ambani: నీతా అంబానీ.. ముఖేష్ అంబానీ అదృష్టం.. పోత పోసిన నిలువెత్తు అందం

సంప్రదాయ గుజరాత్ కుటుంబంలో పుట్టిన ఆమె.. 8 సంవత్సరాల వయసులోనే తన తల్లి వద్ద నృత్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. వ్యాపారంలో బిజీగా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో నీతా అంబానీ నృత్య ప్రదర్శనలిచ్చారు.

Written By: Suresh, Updated On : February 11, 2024 3:38 pm

Nita Ambani

Follow us on

Nita Ambani: ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. మనదేశంలో ఆగర్భ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ విజయం వెనుక కూడా ఆయన సతీమణి నీతా అంబానీ ఉంది. ఇదే విషయాన్ని ఆయన పలమార్లు చెప్పారు. ఆమె తోడ్పాటు వల్లే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనితర సాధ్యమైన లాభాలు సాధిస్తుందని ప్రకటించారు. తన భార్య తన ఎదుగుదల విషయంలో చూపిస్తున్న చొరవకు ఆయన మంత్రముగ్ధుడు అవ్వని క్షణం అంటూ లేదు. అందుకే నీతా అంబానీ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తుంటాడు. అత్యంత విలువైన బహుమతులను ఆమె కోసం కొనుగోలు చేస్తాడు. ప్రత్యేకమైన జెట్ విమానం, విలాసవంతమైన ఓడ, సకల సౌకర్యాలున్న భవనం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విలువైన బహుమతులను నీతా అంబానికి ముకేశ్ అంబానీ అందించాడు.. భర్తపై కూడా నీతా అంబానీ అచంచలమైన ప్రేమానురాగాలు కురిపిస్తూ ఉంటుంది. కార్పొరేట్ ప్రపంచంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా నీతా అంబానీ అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటారు. 1963 నవంబర్ 1 న గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన నీతా అంబానీ వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. అయినప్పటికీ ఆమె 30 సంవత్సరాల యువతీ లాగానే కనిపిస్తారు.. సౌందర్య పోషణకు అత్యంత విలువ నిచ్చే ఆమె.. నిలువెత్తు అందానికి ప్రతీకగా దర్శనమిస్తుంటారు..

సంప్రదాయ గుజరాత్ కుటుంబంలో పుట్టిన ఆమె.. 8 సంవత్సరాల వయసులోనే తన తల్లి వద్ద నృత్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. వ్యాపారంలో బిజీగా ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో నీతా అంబానీ నృత్య ప్రదర్శనలిచ్చారు. అయితే తన అందాన్ని కాపాడుకునేందుకు నీతా అత్యంత ప్రాధాన్యమిస్తారు.. సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులను ఆమె వాడుతారు. ఎట్టి పరిస్థితుల్లో కృత్రిమ సౌందర్య ఉత్పత్తుల జోలికి వెళ్లరు. ఆత్మవిశ్వాసాన్ని తన నుంచి ఎప్పుడూ దూరం చేసుకోరు. పూర్తి శాకాహారి అయినా నీతా అంబానీ.. మితంగానే ఆహారం తీసుకుంటారు. ఉదయం లేవగానే హిమాలయాల నుంచి దిగుమతి చేసుకున్న నీటినే తాగుతారు. స్వచ్ఛమైన తేనె, నిమ్మకాయ రసం మిశ్రమంతో కలిపిన నీటిని తాగుతారు. అల్పాహారంలో ఉడికించిన వేరుశనగలు, పప్పుధాన్యాలు, మొలకలు ఉండేలా చూసుకుంటారు.. మధ్యాహ్నం భోజనంలో నాలుగు లేదా ఐదు కూరలు.. అవి కూడా ఆలివ్ ఆయిల్ తో వండినవి మాత్రమే తింటారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నం జోలికి వెళ్లారు. సాయంత్రం పూట ఫ్రూట్ సలాడ్ స్నాక్ గా తింటారు. ముఖ్యంగా జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న పండ్లను ఆమె ఇష్టంగా తింటారు. రాత్రిపూట ఒక మిల్క్ షేక్ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగి పడుకుంటారు.

నవరాత్రి సమయంలో ఆమె కఠిన ఉపవాసం ఉంటారు. వ్యక్తిగత పరిశుభ్రతకు నీతా అంబానీ అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఫ్యాషన్ పరంగా సహజమైన రంగులు వాడిన దుస్తులను మాత్రమే ధరిస్తారు. శిరోజాలు, చేతి, కాళ్ళ గోర్ల సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. తాగే నీరు, తినే తిండి, ఉండే పరిసరాలు మాత్రమే కాకుండా జీవనశైలి కూడా అందాన్ని ప్రతిబింబిస్తుందని నీతా అంబానీ చెబుతుంటారు. అందుకే 61 సంవత్సరాల వయసులోనూ 30 ఏళ్ల యువతి లాగా నీతా అంబానీ కనిపిస్తుంటారు. ఈ అలవాట్లు మాత్రమే కాదు నిత్యం యోగా చేయడం, నృత్య సాధన చేయడం వంటివి కూడా తనను శారీరకంగా అత్యంత ఫిట్ గా ఉంచుతున్నాయని నీతా అంబానీ చెబుతుంటారు.