BB Utsavam: బిగ్ బాస్ సీజన్ 7 సంచలన విజయం నమోదు చేసుకుంది. అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుని బుల్లితెర పై నెంబర్ 1 షో అనిపించుకుంది. ఈ రియాలిటీ షో ముగిసి దాదాపు రెండు నెలలు అవుతుంది. కాగా బిగ్ బాస్ లవర్స్ కోసం సీజన్ 7 కంటెస్టెంట్స్ అందర్నీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది స్టార్ మా. బీబీ ఉత్సవం పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో సీజన్ 7 కంటెస్టెంట్స్ దాదాపు అందరూ హాజరయ్యారు.
యాంకర్ శ్రీముఖి ఈవెంట్ కి హోస్టింగ్ చేస్తుంది. మాజీ కంటెస్టెంట్స్ డాన్సులు చేస్తూ సందడి చేశారు. స్పై బ్యాచ్ ఇంకా స్పా బ్యాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పైగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక స్పా సభ్యులు శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్ కలిసి ఎక్కడా కనిపించలేదు. ఈ స్టేజి పై మళ్ళీ ముగ్గురు ఒక చోట కనిపించారు. ఇక శోభా, అమర్ దీప్ కోసం నాగార్జున ఇచ్చిన టీ షర్ట్ బహుమతిగా ఇచ్చి సర్పైజ్ చేసింది.
ఇది ఇలా ఉండగా .. యాంకర్ శ్రీముఖి కంటెస్టెంట్స్ అందరితో ఫన్నీ టాస్కులు ఆడించింది. ముఖ్యంగా అమర్ దీప్ తెలివికి పరీక్ష పెట్టింది. ఇందులో భాగంగా శ్రీముఖి .. తడిసిన ఒక చీర 30 నిమిషాల్లో ఆరుతుంది .. మొత్తం 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది? అని అడిగింది. దీంతో అమర్ ఎప్పటిలానే బిక్క మొహం పెట్టి, బిత్తర చూపులు చూశాడు. దీంతో అక్కడే ఉన్న శివాజీ రెండు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
దీంతో అందరూ తెగ నవ్వుకున్నారు. మరోసారి అమర్ దీప్ ని బకరా చేశారని స్పష్టంగా అర్థం అయింది. బీబీ ఉత్సవం ప్రోమో ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ, అమర్ దీప్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. పైకి సరదాగా కనిపించినా వాళ్ళిద్దరికీ అసలు పడేది కాదు. ఏదో విధంగా గొడవలు అవుతూనే ఉన్నాయి. కానీ అదంతా జస్ట్ ఫర్ ఫన్ అని అనేవారు. బయటకు వచ్చిన తర్వాత శివాజీ, అమర్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. బీబీ ఉత్సవం లో ఒక చోట కలిసి సందడి చేయడం విశేషం.