Basmati Rice: పెళ్లి.. పుట్టిన రోజు.. పండుగలు, బంధువులు వచ్చినా.. బయట పిక్నిక్ వెళ్లినా.. వంటకాలు కొంచె స్పెషల్‌గా ఉండాల్సిందే. ఇక బిర్యానీ కచ్చితంగా ఉంటుంది. ఈ బిర్యానీకి వాడేది బాస్మతి రైస్. ఫంక్షన్ చిన్నదా పెద్దదా అని చూడడం లేదు. వీలైనంత వరకు బిర్యానీ విత్ బాస్మతి రైస్ అంటున్నారు. బాస్మతి రైస్ ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా ఎంపికైంది. ఫుడ్ అండ్ ట్రాఎవల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023–24 సంవత్సరానికి ప్రపంచంలో అత్యుతమ్మ బియ్యం జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బాస్మతి బియ్యం చరిత్ర, అది భారత్‌కు ఎలా వచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం.
ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ జాబితాలో..
ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023–24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితా విడుదల చేసింది. ఇందులో బాస్మతి మొదటిస్థానంలో ఉంది. ఇటలీకి చెందిన ఆర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో ఉన్నాయి. బాస్మతి వాసన, రుచి, పెద్ద గింజరు ఉన్నప్పటికీ ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. భారతీయ బాస్మతిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పులావ్ అయినా, బిర్యానీ అయినా భారతీయులు ఇష్టపడేది బాస్మతి. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశమే బాస్మతిని సరఫరా చేస్తుంది. పాకిస్తాన్‌లో కూడా ఈ బాస్మతి సాగు చేస్తున్నారు. అయితే ఎగుమతిలో మాత్రం భారత్ మొదటి స్థానంలో ఉంది.
బాస్మతి చరిత్ర..
సంస్కృత పదాలు వాస్, మయాప్ నుంచి బాస్మతి పేరు వచ్చింది. వాస్ అంటే సువాసన, మయాప్ అంటే లోతు. అయితే ఇందులో వాడిన మతి అనే పదానికి రాణి అనే అర్థం కూడా ఉంది. అందుకే దీనిని సువాసనల రాణిగా పిలుస్తారు.
ఎక్కడ సాగు..
బాస్మతి రైస్‌ను హిమాలయాల దిగువ ప్రాంతంలోని ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్‌లో ఎక్కువగా సాగు చేస్తారు. పురాతన భారత దేవంలో కూడా బాస్మతిని పండించినట్లు చరిత్ర చెబుతోంది. ఆహారంపై రాసిన ఆరోమాటిక్ రైసెస్ అనే పుస్తకంలో హరప్పా, మొహెంజోదారో తవ్వకాల్లో కూడా దీనికి సంబందించిన ఆధారాలు లభించాయని చెబుతుంది. పర్షియన్ వ్యాపారులు భారత దేశానికి వచ్చినప్పుడు తమ వెంట అనేకరకాల సుగంధ బియ్యం తెచ్చుకున్నారని చరిత్ర చెబుతోంది. ద్రవ్యాలను
పెర్షియన్ వ్యాపారులు వ్యాపారం కోసం భారతదేశానికి చేరుకున్నప్పుడు, వారు తమతో పాటు అనేక రకాల సుగంధ బియ్యాన్ని తీసుకువచ్చారని చరిత్ర చెబుతుంది.
భారత్ వెలుపల..
బాస్మతిని భారత్‌లో మాత్రమే కాదు భారత్ బయట పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా సాగు చేస్తారు. ఈ బియ్యాన్ని సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యమత్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచంలో భారతే బాస్మతి రైస్ అతిపెద్ద ఎగుమతిదారు. ఇక, బాస్మతిని సువాసన ద్వారా గుర్తించవచ్చు. బాస్మతి ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ ఫౌండేషన్ బాస్మతి బియ్యం అసలైందో కాదో నిర్ణయిస్తుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీప్రకారం 6.61 మి.మీ పొడవు. 2 మి.మీ మంద ఉన్న బియ్యాన్ని బాస్మతిగా గుర్తించింది.