Barber Ramesh Babu: అప్పట్లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కొని వార్తల్లో నిలిచిన బెంగళూరు బార్బర్ ఇప్పుడు రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు కొని మరోసారి సంచలనం సృష్టించాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణ బార్బర్..
బెంగళూరుకు చెందిన రమేశ్‌బాబు సాధారణ బార్బర్ స్థాయి నుంచి గొప్ప ధనవంతుడిగా ఎదిగాడు. అంటే రాత్రికి రాత్రే ధనవంతుడు కాలేదు. లాటరీ తగలలేదు. అతని జీవితం ఎంతో మందికి ఆదర్శం. సామాన్య బార్బర్‌గా జీవితం మొదలు పెట్టిన రమేశ్ ఇప్పుడు ఏకంగా 200 కంటె ఎక్కువ కార్లు కొనుగోలు చేశాడు. తాజాగా ఆయన గ్యారేజీలోకి మెర్సిడెస్ బెంజ్ ఈ–క్లాస్ సెడాన్ కార్డు కూడా చేరాయి. రమేశ్ సారథ్యంలోనే రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ నడుస్తోంది.
మూడు కార్ల డెలివరీ ఫొటోలు..
తాజాగా రమేశ్‌బాబు మూడు కార్లు డెలివరీ చేసుకుంటున్న ఫొటోలను బెంగళూరుకు చెందిన సుందరం మోటార్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. రమేశ్‌బాబుకు డీలర్‌షిప్ ఉద్యోగి పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ఈ ఫొటోల్లో ఆయన భార్య కూడా ఉన్నారు. మూడుకార్లు వరుసగా నిలిపి ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్..
ఇక భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన క్లాస్ సెడాన్లను రమేశ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ రమేశబాబు ఒకేసారి కొనుగోలు చేశాడు. ఈ మూడు కూడా హైటెక్ సిల్వర్ మెటాలిక్ కలర్ ఆప్షన్ పొందాయి. ఇవన్నీ బ్లాక్ లెదర్ అపోల్స్రెనీ కలిగి ఉన్నాయి.
రమేశ్‌బాబు కార్ల ప్రత్యేకత..
ఇక బార్బర్ రమేశ్‌బాబు ఎంచుకున్న మోడల్ ఈ క్లాస్
రమేష్ బాబు ఎంచుకున్న మోడల్ ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యూ 220డీ. ఈ వేరియంట్ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 192 బీహెచ్‌పీ పవర్ మరియు 400 ఎన్‌ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యూడీ ధర రూ.72.8 లక్షలు (ఎక్స్ షోరూమ్).
రోల్స్ రాయిస్ ఘోస్ట్
ఇక రమేశ్‌బాబు రోల్స్ రాయిస్ ఘోస్ట్ విషయానికి వస్తే.. దీనిని 2011, ఫిబ్రవరిలోనే కొనుగోలు చేశాడు. ఈ తెలుపురంగు కారు ధర రూ.3 కోట్లు. ఇది 6.6–లీటర్ ట్విన్ టర్బోచార్జి పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 562 బీహెచ్‌పీ పవర్ మరియు 780 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
గ్యారేజీలో ఇవి కూడా..
ఇక రమేశ్‌బాబు గ్యారేజీలో రోల్స్‌రాయిస్ మాత్రమే కాదు.. 200 ఇతర కార్లు కూడా ఉన్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్(రూ2.7కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఈ క్లాస్, బీఎం డబ్ల్యూ 5 సిరీస్, అనేక వోల్వో కార్లు, టయోటా క్యామ్రి, హోండా అకార్ట్, హోండా సీఆర్–వీ తదితర కార్లు ఉన్నాయి.