Andaman Jail: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో సక్సెస్ సినిమాలు తీశాడు. ఎలాంటి పాత్రకైనా చిరు ప్రాణం పోస్తాడు. అయన కెరీర్లో వచ్చిన డిఫరెంట్ చిత్రాల్లో ‘వేట’ ఒకటి. ఎ. కొదండరాం రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి అండమాన్ జైల్లో ఉన్నట్లు కనిపిస్తారు. అతి భయంకరమైన ఈ జైలు గురించి సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే రియల్ గానే ఈ జైలు అలా ఉంటుందా? లేక సినిమా కోసం సెట్టింగ్ వేశారా? అని ఇటీవల ఓ వ్యక్తి ‘కోరా’ అనే సోషల్ మీడియాలో కొశ్చెన్ వేశారు. దీనికి ఓ వ్యక్తి సమాధానం ఇచ్చారు. అండమాన్ జైలు ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన ఫొటోలను చూపెడుతూ వివరించారు.
భారతదేశానికి దక్షిణాన ఉన్న అండమాన్ జైలు ఓ ద్వీపంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే సముద్రమార్గమే ఆధారం. ఇతర ఎలాంటి సౌకర్యాలు ఉండవు. ఖైదీలను ఒక్కసారిగా ఒక గదిలో వేస్తే కొన్ని రోజుల పాటు అందులోనే ఉంచుతారు. ఖైదీలు ఒకరికొకరు కలుసుకోకుండా భారీ ఎత్తులో గోడలు నిర్మించారు. గదులకు కిటికీలు కూడా ఉంటాయి. కానీ ఈ కిటికీల నుంచి ఖైదీలు బయటకు చూసే అవకాశం ఉండదు. కానీ ఖైదీలు ఏం చేస్తున్నారో బయటివాళ్లు తెలుసుకోవచ్చు. ఈ కిటీకీలను ఎలా నిర్మించారన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు.
ఈ జైలులో ఉండే శిక్షలు కూడా భయకంరంగా ఉంటాయి. ముందుగా వీరికి గోనె సంచితో తయారు చేసిన చొక్కాలు వేస్తారు. ఇవి ఎప్పటికీ వేడిగా ఉంటాయి. ఇలా ధరించిన వారిని ఎండలో నిల్చోబెడుతారు. ప్యాంటు కూడా గోనె సంచితో తయారు చేయడంతో శరీరం మొత్త వేడితో కూడుకొని ఉంటుంది. కొన్ని పనులను ఎలాంటి పనిముట్లు ఇవ్వకుండా చేయిస్తారు. ఎండిన కొబ్బరికాయల పీచును చేతితో వొలచడం, కొబ్బరి పీచును తయారు చేయిస్తారు. మిగిలిన కొబ్బరి నుంచి ఒక ఎద్దు లేదా ఆవుతో కలిసి గానుగ నూనె తీయిస్తారు. ఇది ఒక్కరోజులో మూడు రేట్ల పనులు చేయిస్తారు.
ఇలాంటి శిక్షలను తప్పించుకోవాలని చూస్తే శిక్షలు అతిభయంకరంగా ఉంటాయి. ఇలా తప్పించుకోవాలనుకున్నవారికి సైతం శిక్షలు అదనంగా వేస్తారు. ఇలాంటి వారు ఉంటే ముగ్గురిని కలిపి ఒకేసారి ఉరి తీస్తారు. కాస్త శిక్ష తక్కువగా ఉంటే వారిని ఇనుప తాళ్లతో కట్టి ఉంచి పారిపోకుండా ఉంచుతారు. ఇక తప్పించుకోవడానికి అస్సలు వీలు లేకుండా ఇనుపకడ్డీతో పెద్ద తాళం తయారు చేశారు. ఈ తాళం 10×10 సైజులో ఉంటుంది. ఇలా అండమాన్ జైలు చిరంజీవి ‘వేట’ సినిమాలో చూపించిన విధంగా కంటే అతి భయంకరంగా ఉంటాయని ఆయన సమాధానం ఇచ్చారు.