Star Brothers: అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తోబుట్టువుల మధ్య వచ్చే కొన్ని గొడవలు కొన్ని రోజుల తర్వాత మంచి జ్ఞాపకాలుగా మిగులుతాయి. సంవత్సరాల తరబడి ఒకరి మధ్య ఒకరకు మాటలు కలవకపోవచ్చు.. కానీ ఏదొక సందర్భంలో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే… మళ్లీ ఆ బంధం ఒక్కటి అవుతుంది. అందుకే తల్లులు వేరు అయినా తండ్రి పంచిన రక్తం ఒక్కటేగా, అందుకే అన్నదమ్ములందరూ కలిసే ఉంటారు.
![]()
అలా కలిసే ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎందరో అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరికి తండ్రిలు వేరు అయినా, మరికొందరికి తల్లులు వేరు అయినా.. ఒక్కటిగా కలిసి ఉంటున్నారు. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఆప్యాయంగా ఉంటున్నారు. మరి ఆ ఆదర్శవంతమైన అన్నదమ్ములు, అక్క చెల్లెలు గురించి తెలుసుకుందాం.
అక్కినేని నాగ చైతన్య & అక్కినేని అఖిల్ :
కింగ్ నాగార్జున నట వారసులు వీళ్ళు. అయితే తండ్రి నాగ్ అయినా.. వీరిద్దరికి తల్లులు వేరు. నాగార్జున మొదటి భార్య లక్ష్మీకి నాగ చైతన్య జన్మించగా.. నాగార్జున రెండో భార్య అయిన అమలకు అఖిల్ జన్మించాడు.
మంచు మనోజ్ & మంచు విష్ణు, మంచు లక్ష్మీ :
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటి భార్య విద్య దేవి గారికి మంచు విష్ణు, మంచు లక్ష్మీలు జన్మించారు. ఇక మంచు మనోజ్ మాత్రం మోహన్ బాబు గారి రెండో భార్య నిర్మల దేవిగారికి జన్మించారు.
కళ్యాణ్ రామ్ & ఎన్టీఆర్ :
హరికృష్ణ గారి మొదటి భార్యకు కళ్యాణ్ రామ్ జన్మించగా, ఇక జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ గారి రెండో భార్యకు జన్మించాడు. తల్లులు వేరు అయినా వీరి మధ్య అనుబంధం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది.
మహేష్ బాబు & నరేష్ :
మహేష్, నరేష్ లు కూడా అన్నదమ్ములే అవుతారు. అయితే, ఈ ఇద్దరికి తండ్రులు వేరు, అలాగే తల్లులు కూడా వేరు. కానీ ఇద్దరు ఒకర్ని ఒకరు గౌరవించుకుంటారు. రోజూ కలిసి మెలిసి లేకపోయినా.. కలిసినప్పుడు మాత్రం ప్రేమగా మాట్లాడుకుంటారు.
సారా అలీఖాన్ & తైమూర్ :
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కు సారా అలీఖాన్ మరియు ఇబ్రహీంలు జన్మించారు. ఆ తర్వాత సైఫ్ కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. సైఫ్ నలుగురు పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
హీరోయిన్ జ్యోతిక & హాట్ బ్యూటీ నగ్మా :
వీళ్ళిద్దరి బంధం కూడా అక్కా చెల్లెల బంధమే. కానీ తండ్రులు వేరు. తల్లి మాత్రం ఒక్కటే.
షాహిద్ కపూర్ & ఇషాన్ కత్తర్ :
షాహిద్, ఇషాన్ ఇద్దరూ ఒక తల్లికి పుట్టినవారే, కానీ తండ్రులు మాత్రం వేరు.
అర్జున్ కపూర్ & జాన్వీ కపూర్ :
బోణి కపూర్ కు మొదటి భార్యకు అర్జున్ కపూర్ పుట్టాడు. ఇక బోణీ కపూర్ రెండో భార్య శ్రీదేవికి జాన్వీ కపూర్ జన్మించింది. మొదట్లో వీరి మధ్య మంచి బంధం లేకపోయినా శ్రీదేవి మరణం తర్వాత.. అందరూ కలిసిపోయారు. ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమగా ఉంటున్నారు.
సన్నీ, బాబీ డియోల్, ఈషా, అహనా డియోల్ :
వీళ్ళకి తండ్రి ఒక్కరే.. కానీ తల్లులు వేరు. అయినా అందరూ ఒకరి పట్ల ఒకరు ఎంతో మర్యాదగా ఉంటారు.
ఇలా చెప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఒకే తల్లికి లేక ఒకే తండ్రికి పుట్టకపోయినా.. మంచి అనుబంధంతో సాధారణ ప్రేక్షకుల అందరికీ స్ఫూర్తినిచ్చేలా కలిసి మెలిసి ప్రేమగా మెలుగుతున్నారు.