Groom Tied Tali Aunt Neck: కొందరు పనులు సజావుగా చేస్తారు. ఇంకొందరు గాబరా పడుతుంటారు. పనులు చేయడంలో శ్రద్ధ వహించే వారు తప్పులు చేయరు. కానీ చీటికి మాటికి ఆందోళనకు గురయ్యే వారు పొరపాట్లు చేయడం సహజం. వీరు మాటల్లో కూడా తడబాటుకు గురవుతుంటారు. నిలకడ లేని ప్రవర్తనతో అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. పొంతన లేని మాటలు మాట్లాడుతూ అందరిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఆగమాగం చేస్తూ వింతగా పనులు చేస్తుంటారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి వారు అరుదుగా కనిపిస్తుంటారు.

తాజాగా ఓ పెళ్లి కొడుకు చేసిన నిర్వాకం అందరిని ఆందోళనకు గురిచేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అతడికి ఎట్టకేలకు వివాహం నిశ్చయమైంది. రాకరాక అవకాశం రావడంతో అతడు ఎంతో ఉత్సుకత చూపాడు. కానీ తాళికట్టే తతంగంలోనే తప్పు చేశాడు. వధువు మెల్లో కట్టాల్సిన తాళిని పొరపాటున ఆమె తల్లికి కట్టేశాడు. దీంతో అందరు అవాక్కయ్యారు. అతడు చేసిన పనికి కంగారు పడ్డారు. అమ్మాయికి బదులు అత్త మెడలో తాళి కట్టడంతో ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్నలు వస్తున్నాయి.
పంతులు గారు నాయనా తాళి కట్టు అనగానే ఎవరికి కట్టాలో కూడా తెలియలేదు. పెళ్లి కూతురు మెడలో కట్టాల్సి ఉన్నా ఆమె తల్లి మెడలో కట్టడం వివాదానికి కారణమైంది. దీంతో అక్కడున్న వారందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వధువు మెడలో కట్టాల్సిన సమయంలో పక్కనే ఉన్న అత్తకు తాళి కట్టి మరోమారు అందరిని అనుమానాలకు గురి చేశాడు. అత్త మెడలో రెండు పుస్తెల తాళ్లు వేలాడుతుండటంతో ఇక ఏం చేసేదని అందరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆమె ఎవరికి భార్య. అల్లుడికా భర్తకా అనే సందేహాలు వస్తున్నాయి.

చూసీచూడనట్లు అత్త మెడలో తాళి కట్టిన అతడి ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ఎప్పుడు ఏదో ఒక విషయానికి ఇబ్బందులకు గురయ్యే అతడు పెళ్లి విషయంలో కూడా స్పష్టత లేకుండా ఉండటంతో ఇక ఏం చేయాలనే వాదన అందరిలో వస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి వాడు సంసారం చేస్తాడా? లేక పారిపోతాడా? అనే కోణంలో అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. హుందాగా కనిపించినా లోపల ఆయన మరో అపరిచితుడుగా వ్యవహరించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక పెళ్లి ఎలా చేసుకుంటాడు. ఎలా తన జీవితాన్ని మలుచుకుంటాడనే పలువురు ప్రశ్నిస్తున్నారు.