Non Veg Plants: మనకు మొక్కలు వెజిటేరియన్ గానే తెలుసు. నాన్ వెజ్ తినే మొక్కలు ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా మొక్కలు వెజిటేరియన్ అనే భావిస్తుంటాం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కానీ మాంసాహారం తినవు. ఈ ప్రపంచలో నాన్ వెజ్ తినే మొక్కలు ఉన్నాయని మనకు తెలియదు. మాంసాహారం తినే మొక్కలు క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో మనకు వాటిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం మామూలే.

పోర్చుగీసు సన్ డ్యూ గా పిలబడే మొక్క నాన్ వెజిటేరియన్. ఇది తన దగ్గరకు వచ్చే కీటకాలను ఆహారంగా తీసుకుంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మొక్క పైభాగంలో వెంట్రుకల ఆకారం లాంటి కాడల మీద జిగురుగా ఉండే మకరందం కలిగి ఉంటుంది. దీంతో మకరందం కోసం వచ్చిన కీటకాలు ఆ జిగురుకు అతుక్కుంటాయి. తరువాత మొక్క వాటిని లోపలకు పీల్చుకుని తినేస్తుంది. ఇలా మాంసారం తినే మొక్కలు ఉండటం గమనార్హం. ఈ మొక్కలు చూడటానికి అందంగా కనిపిస్తాయి. అన్నింటిని ఆకర్షిస్తాయి.
వీటికి డ్రోసరా సన్ డ్యూ అనే మరో పేరు ఉంది. పోర్చుగీసులో ఇవి వెంటనే వాటిని లోపలికి ముడుచుకుని తప్పించుకోకుండా బంధిస్తాయి. తరువాత వాటిని తినేస్తాయి. అలా ఈ మొక్కలు జీవిస్తుంటాయి. వీటి శాస్త్రీయ నామం డ్రోసోఫిలం లుసజీవికం అని పిలుస్తుంటారు. పోర్చుగీసులో నత్రజని తక్కువగా ఉండే నేలల్లో ఇవి మనుగడ సాగిస్తాయి. ఇలా నాన్ వెజ్ తినే మొక్కలు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు. వీటి గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. అవి ఎందుకు కీటకాలను ఆహారంగా తీసుకుంటాయని ఆలోచనలు చేస్తున్నారు.

నెవెంథన్, పోర్చుగీసు సన్ డ్యూ, మెకాసిన్ కోబ్రాలిల్లీ, వినస్ ఫ్లైట్రాప్ వంటి మొక్కలు నాన్ వెజ్ మాత్రమే తీసుకుంటాయి. ఈ మొక్కలు మాత్రమే ఎందుకు మాంసారం తింటున్నాయో తెలియడం లేదు. అది వాటి సహజ స్వభావమే. కానీ ఈ మొక్కల ప్రత్యేకత ఏమిటనే దానిపై శాస్త్రవేత్తలు శోధనలు చేస్తున్నారు. మొక్కల సహజత్వానికి భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నాయనే దానిపై కూలంకషంగా పరిశీలిస్తున్నారు. భూమి మీద కీటకాలను తినే చెట్ల గురించి ఇంతవరకు ఎవరికి తెలియదు.