Instagram Content: ” నేనొక పేరు మోసిన డాక్టర్ ని. నాకు ప్రతిరోజు విపరీతంగా ఓపి ఉంటుంది. సర్జరీలు కూడా భారీగానే జరుగుతుంటాయి. ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తు ఉంటుంది. కానీ నాకు నచ్చినట్టుగా నేను ఇల్లు కట్టుకోవడానికి చాలా రోజుల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. డబ్బులు సరిపోక బ్యాంకులలో రుణం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కానీ మా బంధువుల అబ్బాయి సోషల్ మీడియాను నమ్ముకుని పైకి ఎదిగాడు. చెప్పుకునే స్థాయిలో చదువుకోక పోయినప్పటికీ.. నాకంటే పెద్ద ఇల్లు కట్టాడు. ఇప్పుడు నేను చదువుకొని ఏం ఉపయోగం” అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఓ వైద్యుడు పోస్టుకు తెలుగు అనువాదం ఇది.
Also Read: ప్రభాస్ పెళ్లి చెడగొట్టింది ఎవరు..? అందుకే ఆయన ఇక మ్యారేజ్ చేసుకొనని డిసైడ్ అయ్యాడా..?
కేవలం ఆ వైద్యుడి పరిస్థితి మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న అందరి పరిస్థితి కూడా ఇదే. సోషల్ మీడియా ద్వారా పేరు తెచ్చుకున్న వారు విపరీతంగా సంపాదిస్తున్నారు. రకరకాల మార్గాల ద్వారా వారు డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. ఎటువంటి నేపథ్యం అవసరం లేకుండానే కేవలం నూతనత్వాన్ని.. విభిన్న తత్వాన్ని నమ్ముకుని వారు ఈ స్థాయికి ఎదుగుతున్నారు. అయితే సోషల్ మీడియాలో చెత్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పనులు చేసి కూడా చాలామంది దండిగా సంపాదిస్తున్నారు. కొందరైతే దానిని ఒక అలవాటుగా మార్చుకొని.. చూస్తుండగానే ఎదిగిపోతున్నారు..
ఇన్ స్టా గ్రామ్ లో..
ఇన్ స్టా గ్రామ్ లో కొందరు ఇన్ ప్లూయన్సర్లు డబ్బు సంపాదనే లక్ష్యంగా అత్యంత దారుణమైన కంటెంట్ తో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది యువతులు యువకులను అట్రాక్ట్ చేసే విధంగా రీల్స్ చేస్తున్నారు. వారిని టెంప్ట్ చేస్తూ.. దాన్ని ప్రైవేట్ లో ఉంచి.. మరింత కంటెంట్ కోసం సబ్క్క్రిప్షన్ కూడా అడుగుతున్నారు. ఇలా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇన్ స్టా లో ఓ యువతి ఇలానే చెత్త కంటెంట్ తో లక్షల సంపాదిస్తోంది. తన ఫీజును నెలకు 399గా ఆమె నిర్ణయించింది. ఇప్పటికే ఆమెను 8731 మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు. దీని ద్వారా ఆమె ఏకంగా 35 లక్షల వరకు సంపాదిస్తోంది. అత్యంత దారుణమైన దృశ్యాలతో ఆమె యువకులను ఆకట్టుకుంటున్నది. అంతర్గత అవయవాలు బయటికి కనిపించే విధంగా ఆమె ప్రదర్శన చేయడం.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి.. అట్రాక్ట్ చేయడం నేర్చుకుంది. ఈమె మాత్రమే కాదు ఆ మధ్య హైదరాబాద్ నగరానికి చెందిన ఓ జంట తమ ప్రైవేటు వీడియోలను విక్రయించారు. వారు సాగించే సంసార జీవితాన్ని రికార్డు చేసి అమ్మడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాలలో లైవ్ రూపంలో కూడా టెలికాస్ట్ చేశారు. తమ ప్రైవేట్ కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి.. తమ పిల్లల చదువు కోసం వినియోగిస్తున్నట్టు చెప్పారు. చివరికి ఆ దంపతుల బాగోతం బయటపడడంతో పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టుకు తరలించారు. ఇక సామాజిక మాధ్యమాలలో నీచాతి నీచమైన పనులు చేసేవారు పెరిగిపోయారు. దానిని ఒక వృత్తిలాగా మార్చుకొని సంపాదించుకుంటున్నారు. పైకి ఎన్నో నీతులు చెప్పే మెటా కంపెనీ ఇటువంటి వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోదు? బ్లూ టిక్ తీసుకుంటే ఏం చేసినా మెటా కిక్కు మనదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.