Dubai: అక్కడ ఒకప్పుడు తాగునీరు కూడా గగనం. ఇసుకతిన్నెలు తప్ప మరొక్కటి లేనితనం. ఇప్పుడు ఆ దేశం పర్యాటకులకు స్వర్గధామం. అక్కడ అధునాతన సౌకర్యాలు అమోఘం. అక్కడ బతకాలనుకోవడం ఓ జీవితకాల కల. ఇప్పుడు ఆ కలను వేలాది మంది భారతీయులు సాకారం చేసుకుంటున్నారు. ఇండియాలోని మెట్రో నగరాలను వదిలి అక్కడ వాలిపోతున్నారు. ఇంతకీ ఆ దేశమేంటి ? ఆ కథేంటో తెలుసుకోండి.

కనుచూపు మేరలో ఇసుక తిన్నెలు. అక్కడక్కడ ఒయాసిస్ లు. పదో.. పాతికో గృహాలు. ఇది ఒకప్పటి దుబాయ్ పరిస్థితి. సీన్ కట చేస్తే. ఇప్పుడు అధునాతన భవంతులు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టవర్లు. అత్యాధునిక సౌకర్యాలు. ప్రపంచం మొత్తం తన వైపు చూపు తిప్పేలా దుబాయ్ తనను తాను మార్చుకుంది. ఇప్పుడు దుబాయ్ లో జీవించడం ఒక కల. వివిధ దేశాల నుంచి వ్యాపారం నిమిత్తం, నివాస నిమిత్తం లక్షలాది మంది దుబాయ్ వెళ్తున్నారు. అక్కడే ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. తమ వ్యాపార నిర్వహణ అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు మెట్రో సిటీల్లో ఇళ్లు కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టిన భారతీయులు .. ఇప్పుడు దుబాయ్ వైపు పరుగెత్తుతున్నారు. దుబాయ్ లో ఇల్లు కొని సెటిల్ అవ్వాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇంటిని కొనేశారు. కొందరు నివాసానికి ఇంటిని కొంటే.. మరికొందరు పెట్టుబడి మార్గంగా ఇంటిని కొన్నారు. గతేడాది దుబాయ్ లో ఇళ్లు కొన్న భారతీయులు సంఖ్య చూస్తే విస్తుపోయాలా ఉంది. గతేడాది భారతీయులు అక్షరాల రూ. 35,500 కోట్లు విలువైన ఇళ్లను కొనుగోలు చేశారు. 2021తో పోలిస్తే ఇంటి కొనుగోలు విలువ రెట్టింపు అయింది. దుబాయ్ లోని మొత్తం ఇళ్ల కొనుగోలుదారుల్లో 40 శాతం మంది భారతీయులు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. ఈ నలబై శాతం మందిలో హైదరాబాద్, సూరత్, అహ్మదాబాద్,ఢిల్లీ, పంబాబ్ వాసులు ఉన్నారు. యూఏఈలో ఉన్న భారతీయులు 40 శాతం మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు 20 శాతం మంది ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ఇంత పెద్ద ఎత్తున దుబాయ్ లో భారతీయులు ఇళ్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం .. అక్కడ ఉన్న అధునాతన సాంకేతిక సౌకర్యాలే. కరోన ముందు దుబాయ్ అద్దె మార్కెట్ 30 శాతం క్షీణిస్తే.. ఇప్పుడు 2015 -16 స్థాయికి చేరింది. ఇక్కడ ఇల్లు కొనడానికి మరొక కారణం వ్యాపార పరంగా గ్లోబల్ కనెక్టివిటీ ఉండటమని చెప్పవచ్చు. ఇక్కడి ఫిన్ టెక్ ఎకో సిస్టమ్ ఎంతో మంది భారతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. ఫలితంగా ఇండియా నుంచి అనేక మంది దుబాయ్ కు వస్తున్నారు. ఇక్కడే నివాసం ఏర్పరుచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. భారతీయులు కొంటున్న ఇళ్ల ధర ఒక్కోటి 3.6 -3.8 కోట్ల ధర ఉండొచ్చని తెలుస్తోంది. వీటి నుంచి నెలకు 3-3.5 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు.
దుబాయ్ పై భారతీయులకు అంత మోజు పెరగడానికి అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ అని చెప్పవచ్చు. విలాసాల కోసమే అయితే.. వారమో.. నెలో ఉండి ఇండియాకు రావొచ్చు. కానీ అక్కడే ఇల్లు కొని సెటిల్ అవ్వాలనే ఆలోచన రాదు. కేవలం వ్యాపార వర్గాలను ప్రోత్సహించడానికి అక్కడ ఉన్న ఎకో సిస్టమ్ పలువురిని ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. ఇండియా కూడా అలాంటి ఎకో సిస్టమ్ ను గ్లోబల్ కనెక్టివిటీని అందించగలిగితే… ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే అవసరం ఉండదు.