
AP Politics : ఆయన అండతో మొన్న ఓ పార్టీ అధికార పీఠం అధిరోహించింది. ఆయన దెబ్బకు నిన్న ఓ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు మరో పార్టీకి అదే గతి పట్టనుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ గెలుపు ఖాయం. ఆయన కన్నెర్ర చేస్తే ప్రత్యర్థులకు ఓటమి తథ్యం. ఇది చరిత్ర. వర్తమానంలో చరిత్ర రిపీట్ అవుతుందా ?. ఇదే చర్చ ఏపీ అంతటా జరుగుతోంది. ఇంతకీ ఆయనెవరు ? ఆ కథేమిటో తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అప్పటి వరకు జస్ట్ ఓ సినిమా స్టార్. ప్రజారాజ్యంలో యువరాజ్యం పగ్గాలు చేపట్టినప్పటికీ రాజకీయానుభవం నామమాత్రం. ప్రజారాజ్యం అనుభవాలను పాఠాలుగా నేర్చుకున్నారు. రాజకీయ కదనరంగంలోకి దూకడానికి సిద్దమయ్యారు. తొలిసారిగా సొంతంగా జనసేన పార్టీ స్థాపించారు. కానీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రాజకీయాల్లో పసిబాలుడు వలె ఉన్న జనసేనను ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దించకుండా.. టీడీపీ, బీజేపీలకు మద్దతు తెలిపారు. ఎన్నికలకు దూరంగా ఉండి.. ఆ రెండు పార్టీలను గెలిపించారు. గెలిపించిన పార్టీనే అని ఊరుకోకుండా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారు.
2019లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. జనసేనాని ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమయ్యారు. జనసైనికులను సిద్ధం చేశారు. మొత్తం సీట్లలో పోటీ చేశారు. ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచారు. కానీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం భవిష్యత్తునే మార్చేశారు. జనసేన దెబ్బకు తెలుగుదేశం భారీగా నష్టపోయింది. కేవలం 23 సీట్లకు పరిమితమైంది. కానీ వైసీపీ .. జనసేన ప్రభావంతో 50 నుంచి 60 సీట్లను గెలుచుకుంది. జనసేన పోటీతో భారీగా ఓటు చీలింది. అది వైసీపీ కలిసొచ్చింది. దీంతో జగన్ సీఎం అయ్యాడు.
జగన్ సీఎం అయినప్పటి నుంచి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నాడు. పవన్ కల్యాణ్ ప్రభావాన్ని గుర్తించాడు. అందుకే చంద్రబాబును వదిలి పవన్ కల్యాణ్ పై పడ్డాడు. దత్తపుత్రుండంటూ విమర్శలు చేస్తున్నాడు. అధికార మదంతో రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చాడు. ప్రజల మధ్య చిచ్చుపెట్టాడు. కులాల కుంపట్లను రగిలేశాడు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న జగన్ వైఖరిని పవన్ కళ్యాణ్ చూస్తు ఉండలేకపోయాడు. జగన్ చేస్తున్నది తప్పు అని నినదించాడు. కానీ జగన్ .. పవన్ కళ్యాణ్ చెబుతున్న మంచిని సహించలేకపోయాడు. మంత్రులతో అదే పనిగా దుష్ప్రచారం చేయించడం ఆరంభించాడు.
జగన్ వైఖరే.. టీడీపీ, జనసేన పొత్తుకు కారణమవుతోందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మకంగా విమర్శిస్తే.. జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. దీంతో వైసీపీ పీఠం కదిలించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ దీక్షబూనాడు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకు చీలనివ్వనని కంకణం కట్టుకున్నాడు. ఇదే జరిగితే 2019లో టీడీపీకి పట్టిన గతే 2024లో వైసీపీకి పట్టనుంది. రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం పెద్ద ఎత్తున వైసీపీ సీట్లను కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ, జనసేన వేరుగా పోటీ చేసి వైసీపీకి లాభం చేకూర్చాయి. 2024లో అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. జనసేన, టీడీపీ ఓటు బ్యాంకు పోలరైజ్ అయితే వైసీపీ బంగాళాఖాతంలో మునగడం ఖాయం అనిపిస్తోంది.