Traveling Couples: ఇల్లువాకిలీ వదిలి.. రోడ్డుపై పడి.. 30 వేల కిలోమీటర్ల ప్రేమ యాత్ర స్టోరీ ఇదీ..!

స్మృతి, వాసన్..వీరిది ప్రేమ వివాహం. ఎప్పుడూ సంతోషంగా ఉండటంతో పాటు సాహసాలు చేయడం వీరికి ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రేమను వ్యక్తం చేసుకోవడంతో పాటు తమ లవ్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు.

Written By: Swathi, Updated On : February 10, 2024 5:48 pm

Traveling Couples

Follow us on

Traveling Couples: 30 వేల కిలోమీటర్ల ప్రేమ.. అదేంటి ప్రేమకు, 30 వేల కిలోమీటర్లకు సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? అవునండి.. మీరు వింటున్నది నిజమే. ఓ జంట ప్రేమ యాత్ర అది. తమ లవ్ ను వ్యక్తపరిచేందుకు కొత్తగా చేసిన ప్రయత్నం. ఇంతకీ ఆ ప్రేమ జంట ఎవరు? లవ్ ట్రిప్ ఏంటి? అనేది తెలుసుకుందాం.

స్మృతి, వాసన్..వీరిది ప్రేమ వివాహం. ఎప్పుడూ సంతోషంగా ఉండటంతో పాటు సాహసాలు చేయడం వీరికి ఎంతో ఇష్టం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రేమను వ్యక్తం చేసుకోవడంతో పాటు తమ లవ్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం రోడ్ ట్రిప్ నకు వెళ్లడమే కరెక్ట్ అని భావించిన ప్రేమజంట వారి యాత్రను ప్రారంభించారు. అది కూడా పాన్ -అమెరికన్ హైవే రోడ్డుపై ప్రయాణం.

ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి ఇది. సుమారు పదిహేను దేశాల గుండా ముప్పై వేల కిలో మీటర్ల మేర కొనసాగుతుంది. ఉత్తర అమెరికా ఖండం కెనడాలోని ఒంటారియోలో ప్రారంభమై దక్షిణ అమెరికా అర్జెంటీనాలో ముగుస్తుంది. ఎందుకింత సాహసం చేస్తున్నారనే ప్రశ్నకు జంట ఆసక్తికర సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఎవరికైనా చావు ఎప్పుడెలా వస్తుందో చెప్పలేం. అందుకే మనం వెళ్లిపోయే ముుందే ప్రపంచాన్ని ఒక్కసారి ప్రేమగా చుట్టి రావాలని నిర్ణయించుకున్నామని చెప్పడం విశేషం.

లవ్ యాత్ర కోసం వ్యానును కొనుగోలు చేసిన జంట.. దానిలో కిచెన్, పడక గదీని ఏర్పాటు చేసుకున్నారు. తమ జాబ్స్ ను కంటిన్యూ చేస్తూనే యాత్రను కూడా కొనసాగిస్తున్నారు. స్మృతి, వాసన్ లవ్ యాత్ర 2020, ఆగస్ట్ 15న ప్రారంభం అయింది. అప్పటి నుంచి వారి ప్రయాణంలో ఎదురైన ప్రతి దృశ్యం, సంఘటనలు, వింతలు, విశేషాలు అన్నింటిని సేవ్ చేసుకున్నారు. ప్రతిదీ తమ ఇన్ స్టా ఖాతాల్లో పంచుకుంటున్నారు. ప్రస్తుతం వీరిని సుమారు 90 వేల మంది ఫాలో అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.

ప్రేమ జంట చేసిన యాత్ర చివరి దశకు చేరుకోగా.. వీరు ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్నారు. ఇప్పటివరకు వీరి యాత్ర సాఫీగా సాగలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఉదయం సమయంలో రెస్టారెంట్ లేదా హోటల్ దగ్గర ఎక్కడైనా ఆపి వైఫై ద్వారా ఆఫీసు పనులు చేసేవారు. రాత్రి సమయంలో సోలార్ రూఫ్ పని చేయక చీకటిలోనే గడిపేవారు. కానీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ యాత్రను మధ్యలోనే విరమించాలనే ఆలోచన మాత్రం వారు చేయలేదు. ఈ క్రమంలోనే మంచి, చెడు అనుభవాలతో ఎంతో చేరువ అయ్యామంటున్నారు ప్రేమ జంట. వీరి యాత్ర ఈనెల 14 (ప్రేమికుల రోజు)న ముగియనుంది.