Rolls Royce- Garbage Trucks: రోల్స్ రాయిస్.. ప్రపంచంలో అతత్యంత ఖరీదైన కార్ల తకారీ కంపెనీల్లో ఇదీ ఒకటి. 1904లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో దీనిని స్థాపించారు. చార్లెస్ రోల్స్ మరియు హెన్రీ రాయిస్ ఇద్దరూ కలిసి దీనిని ప్రారంభించారు. 1906లో ఉత్పత్తి ప్రారంభించారు. అనతికాలంలోనే బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ సమయంలో భారత దేశాన్ని ఆంగ్లేయులే పాలిస్తున్నారు. దీంతో బ్రిటిష్ వ్యాపారులుల, అధికారులు, రాజులు, గవర్నర్లు ఇండియాకు రాకపోకలు సాగగించేవారు. భారతీయ సామంత రాజులు కూడా వివిధ పనులల నిమిత్తం లండన్‌కు వెళ్లొచ్చేవారు. అక్కడి విలువైన వస్తువులను కొనుగోలు చేసి తెచ్చుకునేవవారు.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పెరిగిన ఉత్పత్తి..
మొదటి ప్రపంచ యుద్ధానికి (1914–1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకుపైగా కార్లను ఉత్పత్తి చేసింది. అందులో 20% ఇండియాకే దిగుమతి చేసింది. ఈ విషయం ఇండియాలో చాలామందికి తెలియదు. ఆ కాలంలో ఇండియాలో 230 మంది మహారాజులు ఉన్నారు. దేశంలో సగటున 2 వేల రోల్స్ రాయిస్ ఉన్నాయి. నాడు ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్‌కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ప్రముఖ మహారాజు ‘‘జై సింగ్’’ ఒకేసారి మూడు ఆటోమొబైల్స్ కొనుగోలు చేసేవాడు. 1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడు.
Also Read: CM Jagan- Early Elections: 2023 మార్చిలోపే షాకివ్వడానికి జగన్ రెడీ!
అతను సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్లాడు. అప్పుడు ఒక బ్రిటిష్ సేల్స్‌మెన్ మహారాజా జై సింగ్‌ను చూíసీ చూడనట్టు వ్యవహరించాడు. ఎందుకంటే అతను కేవలం ఒక సాధారణ పేద భారతీయుడు అని. కింగ్ జై సింగ్ ఈ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చాడు. అప్పుడు అతను తన సేవకులతో షోరూమ్‌కి ఫోన్ చేయించాడు. అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనం కోసం షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు రాజు తన రాజ రూపంలో షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ చార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు.
రోడ్లు ఊడ్చేందుకు ఉపయోగించాలని ఆదేశం..
ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేశక ‘‘జై సింగ్’’ వాటిని తన రాజ్యంలో వీధులను ఊడ్చేందుకు ఉపయోగించాలని ఆదేశించారు. కొద్దిసేపటికే ఈ వార్త ప్రపంచం అంత వ్యాపించింది. నాడు వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. దీంతో ఆ కంపెనీ గుడ్ విల్, ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. చివరకు విషయం తెలుసుకున్న రోల్స్ రాయిస్ వారి ప్రవర్తనకు క్షమాపణలు చెబుతూ భారత రాజు జై సింగ్‌కు టెలిగ్రామ్ పంపింది. అంతేకాదు.. మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందించింది. కంపనీ క్షమాపణలను అంగీకరించిన జై సింగ్ చెత్తను సేకరించడానికి రోల్స్ రాయిస్‌ను ఉపయోగించడం మానేయాలనిఉత్తర్వులు జారీ చేశారు.
Also Read:Telangana BJP- Congress: కమలంలో నిస్తేజం.. కాంగ్రెస్‌లో కనిపించని చేరికల జోష్..!!