
WTC Final -India: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ ఓటమి చెందినప్పటికీ డబ్ల్యూటీసి ఫైనల్ లో చేరే అవకాశం చేజారిపోలేదు. ప్రస్తుతం ఈ టెస్ట్ ఓడిన, డ్రా చేసుకున్న పాయింట్లు పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆస్ట్రేలియా తో పాటు భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కు వచ్చి పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడేందుకు భారత్ తో పోటీపడుతున్న శ్రీలంక ప్రస్తుతం న్యూజిలాండ్తో సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ లో శ్రీలంక ఓడిన, డ్రా చేసుకున్న భారత్ కు తిరుగులేదు. పొరపాటున శ్రీలంక విజయం సాధిస్తే మాత్రం భారత్ డబ్ల్యుటిసి ఫైనల్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్ట్ ఈ నెల 9వ తేదీన ప్రారంభమైంది. మొదటి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన భారత్, మూడో టెస్ట్ లో ఓటమితో డబ్ల్యూటీసి ఫైనల్ బెర్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మూడో టెస్ట్లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా డబ్ల్యూటీసి ఫైనల్ లో మొదటి బెర్తు ను కన్ఫర్మ్ చేసుకుంది. మరో బెర్తు కోసం ప్రస్తుతం భారత్ శ్రీలంక మధ్య పోటీ నెలకొంది.
డ్రా చేసినా సరిపోతుంది
మార్చి 9న ప్రారంభమైన నాలుగో టెస్ట్ లో భారత విజయం సాధించకపోయినా కనీసం డ్రా చేసుకున్న శ్రీలంక ప్రస్తుతం ఆడుతున్న కివీస్ సిరీస్తో సంబంధం లేకుండానే ఫైనల్ చేరుతుంది. అదే భారత్ నాలుగో టెస్ట్ లో ఓటమి చెందితే మాత్రం శ్రీలంక జయాపజయాలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి డబ్ల్యూటీసి 2021-23 ఫైనల్ రేసులో 68.52 విజయాలతో 148 పాయింట్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, 60.29 విజయాలతో 123 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇక 53.33 విజయాలతో 64 పాయింట్లు శ్రీలంక మూడో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు ప్రకారం ఫైనల్ చేరే అవకాశాలు భారత్ కి మెండుగా ఉన్న.. ఓటమిపాలైతే పరిస్థితి ఏంటని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ ఈ టెస్ట్ లో ఓటమి చెందడం వలన కొన్ని పాయింట్లు తగ్గడంతో పాటు, అటు శ్రీలంక న్యూజిలాండ్ పై టెస్ట్ లో గెలిస్తే వారి పాయింట్లు పెరుగుతాయి. దీంతో భారత్ కంటే శ్రీలంక పాయింట్లు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఫైనల్ బెర్తుకు శ్రీలంక నుంచి ముప్పు పొంచి ఉంది.

రెండు టెస్టుల సిరీస్..
ప్రస్తుతం శ్రీలంక న్యూజిలాండ్తో రెండు టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ నెల తొమ్మిదో తేదీనే మొదటి టెస్ట్ ప్రారంభమైంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక మెరుగైన స్కోర్ సాధించి పటిష్ట స్థితిలోనే నిలిచింది. శ్రీలంక బ్యాటర్లు కరుణరత్న, కుసాల్ మెండీస్, మాథ్యూస్, చండిమల్, ధనుంజయ డిసిల్వా మెరుగైన బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 355 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 291 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది. మూడో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతోంది. డారీ మిచెల్ సెంచరీ తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా, మాటి హెన్రీ 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మ్యాచ్ ను పరిశీలిస్తే ఈ టెస్ట్ లో శ్రీలంక కొంత మెరుగైన స్థితిలో కనిపిస్తుండడం భారత్ కు ఆందోళన కలిగిస్తోంది.