
ED Cases: 2014 నుంచి.. మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు ఫైల్ చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నాయకులు, వారి బంధువుల మీద నమోదయ్యాయి. ఇందులో 0.46% శాతం కేసులే రుజువయ్యాయి. అంటే దీనిని బట్టి తమను రాజకీయంగా కుంగ తీసేందుకు, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులు ఎదుర్కొంటున్న వారు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోగానే సచ్చీలురుగా మారుతున్నారని ధ్వజమెత్తుతున్నాయి. అప్పటిదాకా దూకుడుగా వ్యవహరించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు కనిపించకుండా పోతున్నాయని ఉదహరిస్తున్నాయి.
ఇక మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 95% కేసులను ప్రతిపక్ష నాయకుల పై నమోదు చేసింది. ఇందులో 0.46 శాతం మాత్రమే నిరూపణ జరిగింది. ఇంకా నిరూపణ కానీ లేదా ట్రయల్ దశలోన కేసులు ఈ తొమ్మిది సంవత్సరాలలో ఈడి 121 మంది ప్రతిపక్ష నాయకుల పై 115 కేసులు నమోదు చేసింది. తొమ్మిది సంవత్సరాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 124 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకుల పై 118 కేసులు నమోదు చేసింది. పి ఎం ఎల్ ఏ తదితర సెక్షన్ల కింద ఈడి 5,422 కేసులు నమోదు చేసింది. ప్రతిపక్ష నాయకులపై 5,150 కేసులు నమోదు చేసింది. ఇందులో శిక్ష పడ్డవారు లేదా రుజువైన కేసులు 25 మాత్రమే. ఇక 10 సంవత్సరాల యూపీఐ హయాంతో పోలిస్తే, 9 సంవత్సరాల బిజెపి హయాంలో విపక్షాలపై 27 రేట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
వీరి పైన కేసులు మాయం
నారాయణ రాణే
మనిలాండరింగ్ కేసులో ఈయనపై ఈడీ కేసులు పెట్టింది. 2017 నుంచి ఈయన కేసు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది. 2017లో బిజెపికి అనుబంధంగా సొంత పార్టీ పెట్టుకోవడంతో దాడులు ఆగిపోయాయని ఢిల్లీ వర్గాలు చెబుతుంటాయి. తర్వాత ఈయన కేంద్ర మంత్రి అయ్యారు. 2019లో పార్టీని బిజెపిలో విలీనం చేశారు.
సువేందు అధికారి
పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఈయన. శారద మల్టీ లెవెల్ మార్కెటింగ్ కుంభకోణంలో 2014 నుంచి సిబిఐ పలమార్లు ఈయనను ప్రశ్నించింది. ఆ తర్వాత 2020లో ఈయన బిజెపిలో చేరారు. ఇంత వరకు సిబిఐ ఈయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
హిమంత బిశ్వ శర్మ
శారద కుంభకోణంలో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. 2014 నవంబర్లో సిబిఐ ఆయన ఇంటిపై దాడులు చేసింది. 2015 ఆగస్టులో ఈయన బిజెపిలో చేరారు. అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు.
ముకుల్ రాయ్
2014 బెంగాల్లో లంచాలు తీసుకోవడంపై సంచలనం సృష్టించిన శారద స్కాం లో నిందితుడు. సిబిఐ పలమార్లు నోటీసులు ఇవ్వడంతో 2017 లో బిజెపిలో చేరారు. తర్వాత విచారణ ఆగింది. పైగా 2021 మే నెలలో ముకుల్ రాయ్ కి క్లీన్ చీట్ ఇచ్చింది.. ఆ వెంటనే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు.
జ్యోతిరాదిత్యా సింధియా
జ్యోతిరాదిత్యా సింధియా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన పై భూ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. 2020 మార్చి 10న ఆయన భారతీయ జనతా పార్టీలో చేరగానే మధ్యప్రదేశ్ ఎకనామిక్స్ అపెన్స్ వింగ్ ఈ కేసు మూసివేసింది
భావన గవ్ లీ

మహారాష్ట్రలో ఠాక్రే శివసేనలో ఉన్నప్పుడు ఈ డి 5 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏకనాథ్ షిండే వర్గం శివసేన ఎంపీగా ఉన్నారు. వాటికి చీఫ్ విప్ గా కొనసాగుతున్నారు. ఈయనపై ఈడీ కేసులు మరుగున పడ్డాయి.
యశ్వంత్ జాదవ్
యశ్వంత్ జాదవ్, ఆయన సతీమణి యామిని జాదవ్ పై ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసులు పెట్టింది. షిండే వర్గంలో చేరగానే ఆ కేసులు అటకెక్కాయి.
ప్రతాప్ సర్ నాయక్
శివసేనలో ఉన్నప్పుడు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈ డి కేసు నమోదు చేసింది. షిండే సేనలోకి రాగానే కేసు ఊసు లేకుండా పోయింది.
సుజన చౌదరి
తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి ఇండ్లు, కంపెనీలపై 2018 నవంబర్లో ఈడి, 2019 జూన్ రెండున సీబీఐ జిల్లాలు జరిగాయి. వెంటనే ఢిల్లీ వెళ్లి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈ డి దాడులు ఆగిపోయాయి.
సీఎం రమేష్
తెలుగుదేశం పార్టీకి చెందిన సీఎం రమేష్ పై 2018 అక్టోబర్లో ఐటి, 2019 ఏప్రిల్ లో ఈడి దాడులు జరిగాయి. ఆయన కూడా సుజనా చౌదరితో కలిసి జూన్ 20న బీజేపీలో చేరారు. ఆ రోజు నుంచే దాడులు ఆగిపోయాయి.
కార్తి చిదంబరం, డీకే శివకుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, ఆజం ఖాన్, అనిల్ దేశ్ ముఖ్, అభిషేక్ బెనర్జీ, పార్థ చటర్జీ, మనీష్ సిసోడియా వంటి వారు సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నారు.