https://oktelugu.com/

Inaya Sultana: బంపర్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ఇనాయ… ఏకంగా హీరోయిన్ ఆఫర్!

Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6లో ఇనాయ సుల్తానా ఓ సంచలనం. మొదట్లో నెగిటివిటీ ఎదుర్కొన్న ఇనాయ మెల్లగా ఫాలోయింగ్ పెంచుకున్నారు. ప్రేక్షకుల ఫేవరేట్ కంటెస్టెంట్ అయ్యారు. ఇనాయ బోల్డ్ బిహేవియర్ తో పాటు ప్రశ్నించే తత్త్వం ఆమెను పాప్యులర్ చేశాయి. ఒకప్పుడు ఇనాయ సుల్తానా ఎవరో కూడా జనాలకు తెలియదు. ఈమెను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తెచ్చాడు. వర్మతో నైట్ పార్టీలో సన్నిహితంగా ఉన్న ఇనాయ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో […]

Written By: , Updated On : April 18, 2023 / 08:38 AM IST
Follow us on

Inaya Sultana

Inaya Sultana

Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6లో ఇనాయ సుల్తానా ఓ సంచలనం. మొదట్లో నెగిటివిటీ ఎదుర్కొన్న ఇనాయ మెల్లగా ఫాలోయింగ్ పెంచుకున్నారు. ప్రేక్షకుల ఫేవరేట్ కంటెస్టెంట్ అయ్యారు. ఇనాయ బోల్డ్ బిహేవియర్ తో పాటు ప్రశ్నించే తత్త్వం ఆమెను పాప్యులర్ చేశాయి. ఒకప్పుడు ఇనాయ సుల్తానా ఎవరో కూడా జనాలకు తెలియదు. ఈమెను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెలుగులోకి తెచ్చాడు. వర్మతో నైట్ పార్టీలో సన్నిహితంగా ఉన్న ఇనాయ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఆమె పేరు మారుమ్రోగింది. ఆ విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కింది.

కంటెస్టెంట్ సూర్య అంటే నాకు ఇష్టమని ఇనాయ ఓపెన్ గా చెప్పింది. మొదట్లో ఆరోహి రావుతో సన్నిహితంగా ఉన్న సూర్య ఆమె ఎలిమినేట్ అయ్యాక ఇనాయకు దగ్గరయ్యాడు. రెండు మూడు వారాలు ఇనాయ-సూర్య నాన్ స్టాప్ రొమాన్స్ పంచారు. ఇనాయ అయితే మనోడి మైకంలో పడి గేమ్ కూడా పక్కన పెట్టేసింది. దీంతో హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు గేమ్ వదిలేశావని మందలించడంతో ఇనాయ సూర్యను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది.

అయితే పైకి అలా నాటకం ఆడదామని సూర్య-ఇనాయ ఒప్పందం చేసుకున్నారు. దానిలో భాగంగా ఆ వారం ఇనాయ లవర్ సూర్యను ఎలిమినేషన్ కి నామినేట్ చేసింది. అనూహ్యంగా ఇనాయ నామినేట్ చేసిన వారమే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. సూర్య ఎలిమినేట్ అయ్యాక అతని జ్ఞాపకాలతో హౌస్లో గడిపేసింది ఇనాయ. అప్పటి నుండి ఇనాయ గేమ్ బయటకు తీసింది. టాస్క్స్ లో తెగువ చూపిస్తూ, తప్పులను ప్రశ్నిస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు.

Inaya Sultana

Inaya Sultana

ఒక దశలో ఇనాయ టైటిల్ విన్నర్ గా ప్రచారం అయ్యింది. ఫైనల్ కి ముందు ఇనాయ ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ వివాదాస్పదమైంది. నెటిజెన్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. హౌస్ నుండి బయటకు వచ్చాక ఇనాయకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఎట్టకేలకు ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. నటరత్నాలు టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో ఇనాయ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివ నాగు ఈ చిత్ర దర్శకుడు. చందన ప్రొడక్షన్స్ బ్యానర్లో డాక్టర్ దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.