https://oktelugu.com/

Robbery: బ్యాంక్ సీల్ ఉన్నా కూడా డబ్బును ఇలా దొంగలిస్తారట..

Robbery: దొంగలకు ఎన్నో ఉపాయాలు ఉంటాయి. సంపాదించే వాడికి ఒకటే దారి ధర్మం. దోచుకునే వాడికి అన్నిదారులే. ఎటు నుంచి అయినా మోసం చేసి డబ్బు దోచుకోవడమే ధ్యేయంగా కొందరు ఉంటారు. వారు ఎంతటి నిబంధనలు ఉన్నా డబ్బును ఇట్టే దొంగిలిస్తారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు దొంగతనం కూడా ఓ కళే. దీనికి చాలా జాగ్రత్తలు ఉండాలి. వాటితో ఎంతటి రక్షణ ఉన్నా డబ్బును కొట్టేయడం వారికి చిటికెలో పనే. మనం సినిమాల్లో చూస్తుంటాం. డబ్బు […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 18, 2023 / 08:27 AM IST
    Follow us on

    Robbery

    Robbery: దొంగలకు ఎన్నో ఉపాయాలు ఉంటాయి. సంపాదించే వాడికి ఒకటే దారి ధర్మం. దోచుకునే వాడికి అన్నిదారులే. ఎటు నుంచి అయినా మోసం చేసి డబ్బు దోచుకోవడమే ధ్యేయంగా కొందరు ఉంటారు. వారు ఎంతటి నిబంధనలు ఉన్నా డబ్బును ఇట్టే దొంగిలిస్తారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు దొంగతనం కూడా ఓ కళే. దీనికి చాలా జాగ్రత్తలు ఉండాలి. వాటితో ఎంతటి రక్షణ ఉన్నా డబ్బును కొట్టేయడం వారికి చిటికెలో పనే.

    మనం సినిమాల్లో చూస్తుంటాం. డబ్బు దోచుకోవడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తారు. ఒకటి ఫెయిలయినా మరొకటి అందుబాటులో ఉంచుకుంటారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. చిన్న చిన్న దొంగతనాలు చేసే వారికి మాత్రం శిక్షలుంటాయి. పెద్దమొత్తంలో డబ్బు దోచుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. వీరిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తో పాటు చాలా మంది బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఎగనామం పెట్టి విదేశాల్లో హాయిగా ఉంటున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం.

    ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో డబ్బు కట్టలోనుంచి డబ్బు ఎలా దొంగిలిస్తున్నారో చూస్తున్నాం. కట్టలో నుంచి పెన్ను సాయంతో నోట్లు సులభంగా తీసుకుంటున్నారు. కట్టలోంచి నోట్లు ఎలా కొట్టేస్తున్నారో చూస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. కింది కుండ కిందే ఉంటుంది. మీద కుండి మీదే ఉంటుంది. కానీ మధ్యలో కుండను కొట్టేయడమంటే ఇదే. ఇలా డబ్బులు దొంగతనానికి గురవుతున్న సంఘటనలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి.

    Robbery

    ఈ నేపథ్యంలో డబ్బు దొంగతనం అనేది అందరికి నప్పదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో ప్రణాళిక ఉండాలి. దొరికిన తరువాత తట్టుకునే శక్తి కూడా ఉండాలి. లేకపోతే దొంగతనం సాధ్యం కాదు. ఇలా డబ్బును దొంగిలించే వారికి ఉండాల్సిన లక్షణాలు. డబ్బును దొంగిలించడం మనకు మాత్రం వీలు కాదు. ఎందుకంటే మన భయమే మనల్ని పట్టిస్తుంది.