Bigg Boss 6 Telugu : ఫైమా ని చితకబాదేసిన ఇనాయ.. టాస్కు నుండి ఇనాయని తొలగించిన బిగ్ బాస్

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.. టాస్కులు ఆడేటప్పుడు దారుణంగా ఫిజికల్ అయ్యిపోతున్నారు.. గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్కులో ఇనాయ హద్దులు దాటి ఫిజికల్ అవ్వడం వల్ల కీర్తి చేతి వేళ్ళు విరిగిపోయింది..ఈరోజు ఆమె టాస్కు విరిగిన చేతివేళ్లతోనే బాధపడుతూ ఆడింది..ఇక ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘స్నేక్ vs ల్యాడర్’ గేమ్ లో ఇంటి సభ్యులందరూ చెలరేగి ఆడారు..ముఖ్యంగా ఇనాయ […]

Written By: NARESH, Updated On : November 8, 2022 8:17 pm
Follow us on

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.. టాస్కులు ఆడేటప్పుడు దారుణంగా ఫిజికల్ అయ్యిపోతున్నారు.. గత వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్కులో ఇనాయ హద్దులు దాటి ఫిజికల్ అవ్వడం వల్ల కీర్తి చేతి వేళ్ళు విరిగిపోయింది..ఈరోజు ఆమె టాస్కు విరిగిన చేతివేళ్లతోనే బాధపడుతూ ఆడింది..ఇక ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో భాగంగా ‘స్నేక్ vs ల్యాడర్’ గేమ్ లో ఇంటి సభ్యులందరూ చెలరేగి ఆడారు..ముఖ్యంగా ఇనాయ – ఫైమా అయితే కొట్టుకునే రేంజ్ కి వెళ్లారు..ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది.

టాస్కులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన మట్టి తో ఇంటి సభ్యులు రెండు గ్రూప్స్ గా విడిపోయి..ఒక గ్రూప్ ల్యాడర్లు నిర్మించాలి..మరో గ్రూప్ పాములను నిర్మించాలి..ఈ గేమ్ లో వాటిని నిర్మించడానికి హౌస్ మేట్స్ ఉపయోగిస్తున్న మట్టిని ఎటాక్ చేసి దొంగలించొచ్చు..అలా ఫైమా మరియు ఇనాయ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది..ఇంటి సభ్యులెవ్వరు కూడా వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేకపోయారు.

ఇనాయ – ఫైమా మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు ఉన్నాయి..అలాంటి సమయంలో వాళ్ళ మధ్య కాకని మరింత రేపేసింది ఈ టాస్క్..ఈ క్రమంలో ఫైమాకి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తాడు..’అందరి ల్యాడర్లను గమనించి పూర్తి కానీ ల్యాడర్ ఉన్న ఇంటి సభ్యులను తొలగించాలంటూ’ బిగ్ బాస్ ఆదేశం ఇస్తాడు.. అప్పుడు ఫైమా ‘ఇనాయ ల్యాడర్ పూర్తి కాలేదు కాబట్టి..నేను ఇనాయ ని గేమ్ నుండి తొలగిస్తున్నాను’ అని చెప్తుంది ఫైమా.. అప్పుడు ఇనాయ ‘వరస్ట్ గేమర్ ఇన్ ది హౌస్ ఫైమా’ అని తిట్టేసి వెళ్ళిపోతుంది.

వీళ్లిద్దరి మధ్య నిన్న నామినేషన్స్ లో ఎలాంటి గొడవ జరిగిందో మన అందరం చూసాము..బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అడ్డు వచ్చాయి కాబట్టి సరిపోయింది..లేకపోతే వీళ్లిద్దరు కొట్టేసుకునే రేంజ్ ఫైర్ లో నిన్న ఉన్నారు..దీనిపై ఈ వీకెండ్ లో నాగార్జున దగ్గర నుండి వీళ్లిద్దరికీ కోటింగ్ తప్పేలా లేదు.