Polygamy Legal in Eritrea: మన దేశంలో రెండో పెళ్లి చేసుకుంటే శిక్షార్హులు. మొదటి భార్య బతికుండగా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదు. మొదటి భార్య అనుమతితో అయితే ఓకే. కానీ అక్కడ మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే నేరస్తుల కింద లెక్క. ప్రతి వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటేనే చట్టపరంగా నేరస్తుడి కిందే లెక్క. దీంతో ప్రతి వాడికి ఇద్దరు పెళ్లాలుండాల్సిందే. ఇద్దరితో సక్రమంగా సంసారం చేయాల్సిందే. కాదంటే శిక్షకు అర్హులు అవుతారు. ఈ నేపథ్యంలో అక్కడి ఆచార వ్యవహారాలు వింత గొలుపుతున్నా ఇదే నిజం.
తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియ దేశంలో ఈ రకమైన చట్టం అమలులో ఉంది. అక్కడ మహిళా జనాభా ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎరిత్రియలో రెండో వివాహం చేసుకోవాలని ప్రత్యేక చట్టమే చేశారు. దీంతో ప్రతి మగాడు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇద్దరిని సక్రమంగా చూసుకోవాలి. వారిని సమానంగా చూసుకుంటూ ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సంసారం చేసుకోవాలి. ఇక్కడ పురుషుల జనాభాకన్నా మహిళల జనాభా ఎక్కువ ఉండటమే కారణమట. దీంతో రెండో పెళ్లి కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు.
ప్రతి మగాడు ఒకరినే పెళ్లి చేసుకుంటే చాలా మందికి పెళ్లిళ్లు కావడం లేదట. దీంతో ప్రభుత్వం రెండో పెళ్లి చట్టం తీసుకొచ్చింది. తద్వారా అందరికి భర్తలు ఉండేలా చూడాలని సంకల్పించింది. అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దేశం తీసుకొచ్చిన చట్టం రెండో పెళ్లి చేసుకోవటం. ఈ చట్టంతో ఎక్కువ మందికి భర్తలు దొరికే అవకాశం కలుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆడవారికి పతులు లేని లోటు తెలియడం లేదు. దీంతో దీన్ని చట్టబద్ధం చేసి అమలు చేస్తోంది. మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోంది.
ఇలాంటి చట్టం బహుశా ఏ దేశంలోనూ లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆ చట్టంతోనే వారికి మేలు కలుగుతోంది. ఆడవారి జనాభా అధికం కావడంతో వారికి గత్యంతరం లేకే మరో దారి కానరాక వారు రెండో పెళ్లిని చట్టబద్ధం చేసి అందరు మగాళ్లకు విధిగా ఇద్దరుండేలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇంతవరకు మనకు అలాంటి స్థితి మాత్రం రాలేదు. దీంతో మనం సేఫ్ గానే ఉన్నా ఏమో భవిష్యత్ లో వస్తుందేమో తెలియదు. కానీ మొత్తానికి ఎరిత్రియ దేశంలో ఉన్న చట్టంతో మగాళ్లు జత పెళ్లిళ్లు చేసుకోవడం ఓ ప్రహసనంగా మారింది.
Also Read:Amit Shah- Chandrababu: రామోజీరావు మాస్టర్ ప్లాన్.. నేడు అమిత్ షా, చంద్రబాబు భేటీ?