Bathroom Commodes: చదువు రానప్పుడు కాకర కాయ అని చదువుకున్నాక కీకర కాయ అన్నట్టుంది. ప్రభుత్వ అధికారులు పనులు చేయడంలో చూపెట్టే తొందర వాటి నాణ్యతలో పట్టించుకోరు. పని పూర్తి కావాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళతారు. కానీ అందులో ఏవైనా లోపాలుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీంతో అవి సామాన్యులకు ఆయుధాలు అవుతాయనడంలో సందేహం లేదు. సోషల్ మీడియా ప్రాధాన్యం పెరగడంతో ఎక్కడికక్కడ లోటుపాట్లు ఉంటే వాటిపై విమర్శలు రావడం సహజమే. ఈ నేపథ్యంలో తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జరిగిన ఓ సంఘటనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్ గా మారుతోంది. అధికారుల తప్పిదం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

బిల్డింగ్ అన్నాక బాత్ రూం ఉండటం సహజమే. కానీ అది విచిత్రంగా ఉండటమే ఇక్కడ వార్తగా మారింది. పరిశ్రమలకు సంబంధించిన ఓ ప్రాజెక్టు కార్యాలయం ఇటీవల నిర్మించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. తొందరలో ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా పనులు పూర్తి చేయడం గమనార్హం. బాత్ రూంలో ఒక కమోడ్ ఏర్పాటు చేయడం కామనే. కానీ ఇక్కడ రెండు కమోడ్ లు ఏర్పాటు చేయడం సంచలనాలకు కేంద్ర బిందువు అయింది. వాటి మధ్య గోడ కూడా లేదు. వాటికి వేరువేరు తలుపులు కూడా లేవు. ఒకే గదిలో రెండు కమోడ్ లు ఏర్పాటు చేయడంతో వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో అందరు విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Human Sacrifice In Kerala: రాత్రికి రాత్రే కోటీశ్వరులవ్వాలని చేయరాని తప్పు చేశారు
అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట రెండు కమోడ్ లు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమిళ సోషల్ మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కమోడ్ ల ఏర్పాటుపై మతి లేకుండా చేసే పనులతో ప్రతిష్ట మంటగలిపారు. దీంతో కమోడ్ ల ఏర్పాటులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని నెటిజన్లు అడుగుతున్నారు. రూ.1.88 కోట్లతో నిర్మించిన ఈ భవనంలో అధునాతన సదుపాయాలు కల్పించారు. కానీ అడుగడుగునా లోపాలే దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగానే కమోడ్ ల బాగోతం కూడా వెలుగులోకి రావడం సంచలనం కలిగించింది.

ఇటీవల కోయంబత్తూరులో కూడా ఇలాగే నిర్మించారు. దీంతో అధికారుల నిర్వాకం అందరిలో ఆగ్రహం కలిగిస్తోంది. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతూ ముందస్తు ప్రణాళికలు లేకుండా గుడ్డిగా ముందుకు పోతున్నారు. దీంతో విమర్శలకు గురవుతున్నారు. అధికారుల తప్పిదం ప్రజలకు అవకాశంగా కనిపిస్తోంది. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఫలితంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు బదులు లోపాలే దర్శనమిస్తున్నాయి. దీంతో వారి పనులు ప్రజలకు సావకాశంగా మారుతున్నాయడనంలో సందేహం లేదు. ఇప్పటికైనా అధికారులు పనుల మీద శ్రద్ధ వహించి నిర్వహణలో అశ్రద్ధ చూపకూడదని సూచిస్తున్నారు.