Uttar Pradesh: అధిక పార్కింగ్ ఫీజు వసూలు చేసి అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. కారులో వచ్చింది ఐపీఎస్ అధికారి అని తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడి చిరవకు జైలుపాలయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరుగగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జిల్లా ఎస్సీతోనే దురుసుగా..
హాపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్‌వర్మ ఇటీవల కారులో బ్రిజ్‌ఘాట్‌కు వెళ్లారు. మరో వ్యక్తి కారును డ్రైవ్ చేస్తుండగా ఆయన డ్రైవర్ పక్క సీటులో సివిల్ డ్రెస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో పార్కింగ్ స్థలం వద్ద ఉన్న వ్యక్తి రూ.53 పార్కింగ్ ఫీజుకు రశీదు ఇచ్చాడు. కానీ, డబ్బులు మాత్రం రూ.60 తీసుకున్నాడు. ఇదేంటని అడిగితే ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. అయితే అతనితో మాట్లాడుతున్నది ఆఫీసర్ అని తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు పార్కింగ్ ఫీజు తీసుకున్న వ్యక్తి. రూల్స్ ఫాలో కావాలని గద్దించాడు. ఈ సంభాషణలో ఐపీఎస్ అధికారి మొదటి నుంచి రికార్డు చేస్తుండంతో రెండ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ వీడియో మొత్తం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
పార్కింగ్ ముఠాగా అనుమానం..
ఒక్క పార్కింగ్ యజమాని దొరకడంతో పోలీసులకు ఓ పెద్ద అనుమానం కలిగింది. ఇంత దురుసుగా మాట్లాడుతున్నాడు అంటే అతని వెనుక ఎవరైనా ఉండి ఉండాలని అనుమానిస్తున్నారు. లేదంటే పార్కింగ్ ఫీజులు వసూలు చేసేవారంతా సిండికేట్‌గా మారి ఇలా చేస్తున్నారేమో అని అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. తీగ లాగితే డొంక కదులుతుందో లేదో చూడాలి.
IPS अभिषेक वर्मा हापुड़ जिले के SP हैं। आज वे प्राइवेट कार में ड्राइवर के बगल में बैठकर ब्रजघाट पहुंच गए। पार्किंग रसीद पर 53 रुपए लिखे थे, लेकिन वसूले 60 रुपए गए। ठेकेदार के आदमी ने IPS ऑफिर से कहा- ‘कायदे में चलो।’ फिलहाल पार्किंगकर्मी पुलिस कस्टडी में है।#Hapur #Up pic.twitter.com/bYTeGxZI3n
— Sachin Gupta (@SachinGuptaUP) February 24, 2024