Hanuma Vihari: ఆడుదాం ఆంధ్రా అంటూ.. యువ క్రికెటర్ ను ఆడేసుకున్న వైసీపీ నేతలు

జట్టులో 17వ ఆటగాడుగా ఉన్న కేఎన్ పృథ్వీరాజ్ తిరుపతి కార్పొరేషన్ లోని ఓ కార్పొరేటర్ కుమారుడు. అడ్డగోలు సిఫారసులతో ఆంధ్రా రంజీ టీంలో ప్రవేశించాడని ఆరోపణలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : February 27, 2024 4:37 pm

Hanuma Vihari

Follow us on

Hanuma Vihari: క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందో లేదో కానీ.. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం పొలిటికల్ గేమ్ బాగానే ఆడుతోంది. ఈ అసోసియేషన్ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కనుసన్నల్లో ఉంది. ఆయన అల్లుడు సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఆంధ్రా జట్టుకు కెప్టెన్ గా ఉన్న అంతర్జాతీయ క్రీడాకారుడు హనుమ విహారి నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇకనుంచి ఎప్పుడూ ఆంధ్రా రంజీ టీంకు ప్రాతినిధ్యం వహించనని తేల్చేశారు. అయితే దీని వెనుక వైసీపీ నేతల టార్చర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దికాలం కిందట వరకు హనుమ విహారి వైసీపీకి సపోర్టుగా నిలిచేవారు. కానీ ఆయన ఉన్నపలంగా తొలగింపునకు గురయ్యారు.

ఇటీవల బెంగాల్ తో ఆంధ్రా జట్టుకు మ్యాచ్ జరిగింది. కెప్టెన్ గా హనుమ విహారి ఉన్నారు. అయితే జట్టులో 17వ ప్లేయర్ గా ఉన్న పృథ్వీరాజ్ ప్రవర్తన సరిగ్గా లేదు. దీంతో కెప్టెన్ విహారి ఆయనపై మండిపడ్డారు. ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. అయితే మ్యాచ్ ముగిసిన కాసేపటికి విహారిని కెప్టెన్ గా తొలగిస్తూ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. పైగా ఆయనే రాజీనామా ప్రకటించారని చెప్పుకొచ్చింది.కానీ హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇకనుంచి ఆంధ్రా జట్టు ఆడలంటూ తేల్చేశారు. దీనికి పృధ్విరాజ్ కౌంటర్ ఇచ్చారు. ఏం పీకలేవ్ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో అసలు వివాదం బయటికి వచ్చింది.

జట్టులో 17వ ఆటగాడుగా ఉన్న కేఎన్ పృథ్వీరాజ్ తిరుపతి కార్పొరేషన్ లోని ఓ కార్పొరేటర్ కుమారుడు. అడ్డగోలు సిఫారసులతో ఆంధ్రా రంజీ టీంలో ప్రవేశించాడని ఆరోపణలు ఉన్నాయి. తన దురుసు ప్రవర్తనతో పృద్వి విహారిని టార్గెట్ చేశాడు. తన తండ్రి ద్వారా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పెద్దలపై ఒత్తిడి తెచ్చాడు. దాని ఫలితంగానే విహారి కెప్టెన్సీ ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మనస్తాపంతోనే ఆయన ఇకనుంచి ఆంధ్రా టీంకు ఆడనని తేల్చి చెప్పినట్లు సమాచారం.

తాజాగా ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. హనుమ విహారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ రాజకీయ కక్షలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కూడా లొంగిపోవడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిభావంతుడైన ఓ క్రీడాకారుడిని ఆంధ్రా జట్టు నుంచి దూరం చేయడం దారుణమని.
. క్రీడల పట్ల జగన్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధిని ఈ ఘటన తెలియజేస్తుందని చంద్రబాబు ఆక్షేపించారు. మొత్తానికైతే ఇప్పుడు క్రికెటర్ హనుమ విహారి వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఆడుదాం ఆంధ్రా అంటూ చెప్పుకోస్తున్న వైసీపీ నేతలు.. ఓ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిని ఆటకు దూరం చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.