https://oktelugu.com/

RRR Spoof: ‘ఆర్ఆర్ఆర్’ స్పూఫ్ చూస్తే.. నవ్వాపుకోలేరు (వీడియో)..!

RRR Spoof: ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’పై అభిమానులకు ఎన్నో అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రతీసారి నిరాశ పరుస్తూనే ఉంది. 2022 సంక్రాంతి కానుకగా రిలీజు కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కరోనా పరిస్థితులు కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూనే ఉండటం గమనార్హం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 12, 2022 / 12:40 PM IST
    Follow us on

    RRR Spoof: ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’పై అభిమానులకు ఎన్నో అంచనాలున్నాయి. ఈ మూవీ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశలను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రతీసారి నిరాశ పరుస్తూనే ఉంది. 2022 సంక్రాంతి కానుకగా రిలీజు కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కరోనా పరిస్థితులు కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ వాయిదాల పర్వం కంటిన్యూ అవుతూనే ఉండటం గమనార్హం.

    ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుంచి భారీ అప్డేట్స్ చాలానే వచ్చాయి. ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇవన్నీ కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయనే చెప్పొచ్చు. అదే సమయంలో ‘ఆర్ఆర్ఆర్’పై డబ్ స్మాష్, ట్రోల్స్, స్పూఫ్ లు వంటివి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ను ఒడిశాకు చెందిన కొందరు యువకులు స్ఫూప్ రూపంలో రీ క్రీయేట్ చేసి నెటిజన్ల చేత వావ్ అనిపించుకుంటున్నారు.

    ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లోని ప్రతీ సీన్ ను తమదైన శైలిలో చూపించి వారిలోని ప్రతిభకు చాటారు. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ స్పూఫ్ ను చూసిన వారంతా ఆ యువకుల ప్రతిభకు ఫిదా అవుతూ ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే కాకుండా ‘పుష్ప’, ‘త్రీ ఇడియట్స్’,‘అంతిమ్’ సినిమాల ట్రైలర్స్ కూడా ఒడిశా యువకులు రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్  చేశారు.