House : నేటి సోషల్ మీడియా కాలంలో.. అన్నింటిని మనం మర్చిపోయాం. కేవలం స్మార్ట్ అనే పరికరం చుట్టూ తిరుగుతున్నాం. తింటున్నప్పుడు.. తాగుతున్నప్పుడు.. పడుకుంటున్నప్పుడు.. చివరికి నిద్ర నుంచి లేచినప్పుడు.. దానిని చూడందే.. చేతివేళ్లతో టచ్ చేయందే.. మనకు రోజు గడవడం లేదు. స్మార్ట్ ఫోన్ మాయలో పడి మనం చాలా కోల్పోతున్నాం. ఆనందాలను దూరం చేసుకుంటున్నాం. అనుభూతులను కాదనుకుంటున్నాం. చిన్ని చిన్ని ఉద్వేగాలను బలవంతంగా దూరం పెడుతున్నాం.. వాస్తవానికి వీటితోనే కదా మనం పెరిగింది.. వీటితోనే కదా మనం ఇంత వాళ్ళమైంది.. మరి వాటన్నింటినీ పక్కనపెట్టి.. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా మనం ఏ సాధించినట్టు? ఎంతలా ఎదిగినట్టు? ఏం వెనకేసుకున్నట్టు? జ్ఞాపకాలు లేవు.. అనుభూతుల్లేవ్.. బావోద్వేగాలు లేవు.. మరి ఇన్ని కోల్పోయినప్పుడు ఎందుకీ జీవితం.. బ్లడీ హ్యూమన్ లైఫ్!
Also Read : సొంత ఇల్లు కొనుగోలు చేస్తున్నారా? ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోండి..
ఎన్నో చెబుతోంది
ఇప్పుడంతా సోషల్ మీడియా చుట్టూ మనిషి జీవితం తిరుగుతోంది కాబట్టి.. ఆ సోషల్ మీడియాలోనే ఒక ఫోటో తెగ దర్శనమిస్తోంది. అందులో ఒక పెద్ద మర్రిచెట్టు.. దాని పక్కనే విస్తారంగా ఎదిగిన గోధుమచెను.. ఆ మర్రి చెట్టు నీడలో కట్టుకున్న ఓ చిన్నపాటి ఇల్లు.. కనుచూపుమేర మొత్తం గోధుమ చేను కనిపిస్తుంది. గోధుమ చేనుకు దిష్టి తీసినట్టు మర్రిచెట్టు దర్శనమిస్తోంది. ఆ చెట్టు నీడలో కట్టుకున్న ఇల్లు అత్యంత అందంగా కనిపిస్తోంది. కానీ ఈ ఫోటో మనకు చాలా చెబుతోంది. ఇన్నేసి కోట్లు సంపాదించినా.. చెట్లను నరికి భవంతులు నిర్మించినా.. ఎండవేడికి తట్టుకునే చల్లటి గాలి లేదు. మట్టి వాసనను ఆస్వాదించే అవకాశం లేదు. హాయిగా వెన్నెలను చూసుకుంటూ కంటి నిండా నిద్రపోయే సౌలభ్యం లేదు.. అందుకే ఎదిగేటప్పుడు మూలాలు మర్చిపోవద్దు. ఆ మూలాలు మర్చిపోయిన నాడు మన జీవితం చరమాంకంలో ఉందనే విషయాన్ని విస్మరించొద్దు.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ఫోటో నిజమైనదో? ఊహ చిత్రమో తెలియదు కానీ.. ఆ ఫోటో చాలా విషయాలను చెబుతోంది. మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని.. వాటితోనే మనుషులకు మనగడ ఉంటుందని చెబుతోంది.. మనిషి జీవితంలో అభివృద్ధి అనేది ఒక భాగం మాత్రమేనని.. అభివృద్దే మనిషి జీవితం కాదని స్పష్టం చేస్తోంది.. ఎండాకాలంలో ఏసీలు వాడే కంటే.. కూలర్లను ఉపయోగించే కంటే.. మొక్కలను నాటి.. వాటిని సంరక్షిస్తే బాగుంటుందని ఈ చిత్రం చెబుతోంది. అదే కాదు చెట్టును చెట్టు తీరుగా ఉంచాలని.. అభివృద్ధి పేరుతో గొడ్డలి వేటు వేస్తే.. అంతిమంగా నష్టపోయేది మనుషులు మాత్రమేనని ఈ చిత్రం విలువైన పాఠాలను మౌనంగానే వివరిస్తోంది.
Also Raed : వినియోగదారులకు అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి ఇవి పనిచేయవు..