Marital Life: దాంపత్యజీవితంపై ఎన్నో కలలు కంటుంటారు. తమ జీవితం అలా ఉండాలని ఇలా కావాలని ఆశ పడుతుంటారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం వేయరు. అందరు చేసే తప్పులే చేస్తూ సంసారాన్ని కకావికలం చేసుకుంటారు. సముద్రాన్ని అయినా ఈదొచ్చు కానీ సంసారం మాత్రం ఈదడం అంత సులువు కాదని తెలుస్తోంది. దాంపత్యం సవ్యంగా సాగాలంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, అభిమానం. వీటిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు.

నిరంతరం భార్యను పొగడ్తలతో ముంచెత్తితే ఇక ఏం పట్టించుకోదు. కనీసం సరదాలకు తీసుకుపోవడం లేదనే విషయం కూడా మరిచిపోతుంది. కార్యాలయ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా భార్యతో మనసు విప్పి మాట్లాడితే అదే పదివేలు అనుకుంటుంది. దానికి ఉప్పొంగిపోతోంది. ఎప్పుడైనా పంగడ వస్తే ఓ చీర కొనిస్తే చాలు మురిసిపోతుంది. ఇలా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తే పెళ్లాలు బెళ్లాల్లా మారతారు.
మనం మసలుకునే ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. పెళ్లాంపై ఎప్పుడు కోపానికి వస్తే ఇక మనకు అనుకూలంగా ఉండదు. ఎప్పుడు లొల్లి ప్రధానంగా ఉంటుంది. అందుకే సామరస్యంగా ఆమె మనసు తెలుసుకుని ప్రవర్తించాలి. అప్పుడే మనకు సహకరిస్తుంది. వీలైనప్పుడల్లా ఏదైనా చిన్న ఊరైనా సరే ప్లాన్ చేసుకుని వెళ్లాలి. అప్పుడు పిల్లలు, భార్య సంతోషపడతారు. వారితో సంతోషంగా గడపడానికి ఇదే చక్కని అవకాశం.
జీవితం నిస్సారంగా ఉండకూడదు. నిత్యం కొత్తదనంతో నిండి ఉండాలంటే ఇంకా కొన్ని మార్పులు అవసరం. దాంపత్య జీవితం కూడా అవసరమే. వీలు దొరికినప్పుడల్లా జీవితభాగస్వామితో సంసార సుఖం అనుభవించాలి. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. దీంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఇంకా ఎక్కువవుతుంది.
ఇద్దరు కలిసి టీవీ షోలు ఎంజాయ్ చేయడం. ఇందులో కూడా మజా ఉంటుంది. ఎందుకంటే ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం జరుగుతుంది. అందుకే దంపతులు ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. నిత్యం అందివచ్చే ప్రతి సావకాశాన్ని అవకాశంగా చేసుకుని జీవితంలో మరింత ముందుకు వెళ్లాలి. దాంపత్యం హాయిగా సాగడానికి ప్రయత్నాలు చేసుకోవాలి.