Bigg Boss Telugu Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ రంజుగా సాగుతోంది. ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదే రేంజ్ లో ఉంది. కొంత మంది కంటెస్టెంట్ల డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో రసవత్తరంగా సాగుతోంది. ఎలిమినేషన్ వస్తే చాలు ఎవరూ తగ్గకుండా రెచ్చిపోతున్నారు. ఒకరిపైమరొకరు విరుచుపడుతున్నారు. ఈ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో ఇప్పటివరకు ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీ, ముమైత్ ఖాన్.. రెండుసార్లు, స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యారు.
అయితే బిందు మాధవి, అఖిల్ సార్థక్ కూడా టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి మధ్యనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. వీళ్లు తరచూ గొడవలు పడుతుండటం కూడా చూసాం. నటరాజ్, అషు, అజయ్ బిందుమాధవిని టార్గెట్ చేయడం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఎన్నో ఫైటింగులు కూడా జరిగాయి.

కాగా తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అయిన నాగార్జున… బిందు-అఖిల్ ల మధ్య వైరానికి దారితీసిన బాత్రుం ఇష్యూ పై మాట్లాడారు. కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అఖిల్, బిందుమాధవి, శివ ఈ ముగ్గురిని కన్ఫెషన్ రూంకి పిలిచి వీరి మధ్య జరిగిన ఇష్యూపై మాట్లాడారు. వాళ్లు కూడా వాళ్ల వార్షన్ చెప్పుకున్నారు. నాగార్జున ఫస్ట్ బింధుతో మాట్లాడుతూ ‘అసలు అఖిల్ ఏం అన్నాడు… నువ్వు ఏం ఊహించుకుంటున్నావని’ అడిగాడు. నువ్వే పక్కకిరా అనే వర్డ్ ఉపయోగించావ్ అంటూ బిందుకి క్లాస్ తీసుకున్నాడు నాగ్. పైగా ఆ మాట అఖిల్ అన్నాడని ఊహించుకుని శివ కూడా చెప్పడం లేదని మాట్లాడావ్…’ అంటూ బిందుపై ఫైర్ అయ్యాడు నాగ్. ఈ విషయంలో నాగార్జున వీడియోలు చూపించి అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు. అజయ్‌తో జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించాడు. అజయ్ ‘స్పైన్ వీక్’ బిందు అనడంపై కూడా మాట్లాడి పంచాయితీ ముగించాడు నాగార్జున.

మొత్తంగా ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.. అత్యధిక ఫాలోయింగ్ కలిగిన బిందును టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రేక్షకలు కూడా షాక్ లో ఉన్నారు. టైటిల్ రేసులో ఉన్న బిందుని టార్గెట్ చేయడంతో ఆమె ఓటింగ్ పై ఇది ప్రభావితం చూపుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై జరిగే ఎపీసోడ్స్ కూడా మంచి ఫైర్ ని క్రియేట్ చేసేలా నిన్నటి పంచాయితీ చిచ్చుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నెక్ట్స్ నామినేషన్స్ లో కూడా అఖిల్ ఇదే ఇష్యూపై బిందును నామినేట్ చేసే అవకాశం ఉంది. ఇక అఖిల్ కెప్టెన్ కావడంతో బిందుకి నామినేట్ చేసే అవకాశం లేదు. దీంతో వచ్చే వారం జరిగే నామినేషన్స్ కూడా పోటాపోటీగా జరగనున్నాయి.
టైటిల్ ఫేవరెట్ గా అందరూ అనుకుంటున్న బిందుమాధవిపై ఇలా నెగెటివ్ గా బిగ్ బాస్ టీం, హోస్ట్ నాగార్జున ఫోకస్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. బిందును తగ్గించి.. అఖిల్ ను లేపడం వెనుక కారణం ఇదేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిందుమాధవిపై నాగార్జున ఫైరింగ్ ను ఆమె ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. అఖిల్ ను దాటేసి దూసుకెళుతున్న బిందును టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు.
Recommended Videos:


