Viral News
Viral News: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. అందులో అతడు పేరు లేదు.. కాకపోతే అతడు చేసిన పోస్ట్ మాత్రం సంచలనం కలిగిస్తోంది. దేశంలోనే ప్రముఖమైన ఐటీ కంపెనీలో ఒక ఉన్నత హోదాలో అతడు పనిచేస్తున్నాడు. సంవత్సరానికి 7.5 కోట్లు వేతనంగా పొందుతున్నాడు. ఒక అందమైన యువతని గతంలో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా అతనికి ఒక పాప జన్మించింది.. కాకపోతే ఉన్నత హోదాలో ఉండడంతో ప్రతిరోజు 14 గంటలు పని చేస్తున్నాడు. వారానికి 70 నుంచి 90 గంటల వరకు పనిచేయాలని దిగ్గజాలు సలహాలు ఇస్తున్న వేళ.. అతడు తన కంపెనీ మరింత ఉన్నతి సాధించాలని ఉద్దేశంతో 14 గంటల పాటు పనిచేస్తున్నాడు.. ఇలా పని చేస్తున్న క్రమంలో తన భార్య ప్రసవానికి ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో అతడు పక్కన లేడు. కూతురు పుట్టినప్పుడు అతడు ఆఫీసులో మీటింగ్ లో ఉన్నాడు. ఆయన భార్యకు అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక సందర్భాల్లో ఇలానే జరిగింది. దీంతో భర్త తీరుపై విసిగి వేసారి ఆమె విడాకులు ఇవ్వడానికి రెడీ అయింది. దీంతో తన బతుకమ్మ శూన్యం అయిపోయిందని ఆ టేకి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంవత్సరానికి 7.5 కోట్ల వేతనం వస్తున్నప్పటికీ జీవితం శూన్యం లాగా కనిపిస్తోందని అతడు తన నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
డబ్బుంటే అన్నీ ఉన్నట్టు కాదు
సాధారణంగా మన సమాజంలో డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టేనని అందరూ అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి పొరపాటు. ఎందుకంటే డబ్బు ఆనందాన్నిస్తుంది. సంతోషాన్నిస్తుంది. సుఖాలను ఇస్తుందని అనుకోవడం పెద్ద తప్పు. ఈ టెకి జీవితాన్ని కనుక ఉదాహరణగా తీసుకుంటే.. అతడికి సంవత్సరానికి 7.5 కోట్లు వేతనంగా వస్తుంది. అద్భుతమైన బంగ్లా ఉంది. విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అందమైన భార్య ఉంది. అయినప్పటికీ సమయానికి వారి వద్ద అతడు లేడు. సంవత్సరానికి 7.5 కోట్ల వేతనం ఇస్తున్నప్పుడు కంపెనీ కోసం పని చేయాలి కదా ఆమె ప్రశ్న మీరు వేయవచ్చు. కానీ కంపెనీ కంటే, ఇచ్చే వేతనకంటే.. లభించే సౌకర్యాల కంటే.. కుటుంబం చాలా గొప్పది. కుటుంబం సపోర్ట్ లేకుండా ఆయన ఈ స్థాయికి వచ్చేవాడు కాదు కదా.. ఆయన భార్య త్యాగాలు చేయకుంటే అతడు ఆ స్థాయిలో ఉండేవాడు కాదు కదా. కంపెనీ కోసం ప్రతిరోజు 14 గంటలు పని చేస్తున్నప్పుడు.. కుటుంబం కోసం ఆ కాస్త సమయం వెచ్చిస్తే ఎంత బాగుంటుంది కదా.. భర్త తో దూరాన్ని తట్టుకోలేక.. అతడు దూరంగా ఉంటే భరించలేక చివరికి భార్య విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. భర్తకు 7.5 కోట్ల వేతనం వస్తున్నప్పటికీ.. అద్భుతమైన సౌకర్యాలు ఉన్న భవనం ఉన్నప్పటికీ.. విలాసవంతమైన కారు ఉన్నప్పటికీ అవేవీ ఆమెకు సంతృప్తి ఇవ్వడం లేదు. కేవలం తన భర్త పక్కన ఉంటే చాలు అనుకుంటున్నది. దీనిని బట్టి ప్రేమ కంటే, సాంగత్యం కంటే డబ్బు అంత గొప్పది కాదు. ఉద్యోగం ఉన్నతమైనది కాదు.