
Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు చదువుకున్న అందరికీ సుపరిచితమే. గొప్ప వ్యాపారవేత్త. మహీంద్రా ఇండస్ట్రీస్ అధినేత. వ్యాపార లావాదేవీలతో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. కామన్ పీపుల్స్‌కు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే స్ఫూర్తిదాయకమైన, మెస్సేజ్ ఓరియంట్ పోస్టులకు రామెంట్ చేస్తారు రీట్వీట్ చేస్తారు. ఆయన చేసే ప్రతీ పోస్టులో కూడా ఒక మెస్సేజ్ ఉంటుంది. తాజాగా ఆయన పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టుకు ఆయన రాసిన కామెంట్ మరింత ఆసక్తిగా ఉంది. అదేంటంటే.. ‘ఆమెను ఒకసారి కలవాలి, ఆమెతో నేను మాట్లాడాలి.. ఎవరైనా ఫోన్ చేయించండి’ అని ఉంది. అంతగొప్ప వ్యాపారవేత్త తాను కలవాలి, మాట్లాడాలి అంటున్నాడంటే ఆమె ఆయనకన్నా గొప్పది అనుకుంటాం. నిజంగా గొప్ప మహిళే. కానీ, బిజినెస్‌లోనో, సంపాదనలోనో కాదు. శుభ్రతలో ఆమెకు ఎవరూ సాటిలేరు. ఇంతకీ ఆమె ఎవరూ, ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం.
కర్ణాటకకు చెందిన మహిళ..
ఈ వీడిమొలో చూస్తున్న మహిళ చూస్తే ఓ పేదింటి మహిళగా కనిపిస్తుంది. వస్త్రధారణ బట్టి చూస్తే గిరిజనురాలై ఉంటుందని తెలుస్తోంది. ఆమె చెత్త ఏరుతున్నది కర్ణాటకలోని అంకోలా బస్టాండ్. అయితే ఆమె స్వీపర్ మాత్రం కాదు. ఆమె పేరు ఎవరికీ తెలియదు. కానీ ఆమె అడవి నుంచి సేకరించిన పండ్లను నిత్యం తీసుకువచ్చి బస్టాండ్‌లో ప్రయాణికులకు అమ్ముతూ ఉపాధి పొందుతుంది.
అమ్మడంలోనూ వైవిధ్యం..
చదువుకున్న అనేక మంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. చదువుకున్న మనం కూడా పండ్లు కొనుగోలు చేస్తున్నాం. మనకు ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో కూడా తెలుసు. కానీ, ఈ మహిళ మాత్రం ఏమీ చదువుకోలేదు. కానీ, ఆమె పండ్ల అమ్మకంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తోంది. పర్యావరణ పరిరక్షణను కోరుకుంటోంది. ఆమె అమ్మె పండ్లను ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఆకుల్లో పెట్టి ఇస్తుంది. అయితే వాటిని కొన్నవారు మాత్రం పండ్లను తిని తొక్కలను బస్టాండ్‌లో పడేస్తున్నారు. ఇది చూసిన ఆ మహిళ పండ్ల బుట్టను పక్కన పెట్టి ప్రయాణికులు పడేసిన ఆకులు, తొక్కలతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి చెత్తబుట్టలో వేస్తోంది.
తన పని కాకపోయినా..
వాస్తవానికి బస్టాండ్‌లో వ్యర్థాలను తీసేయడం ఆమె పని కాదు. కానీ తను అమ్మిన పండ్లు తిని పడేస్తున్నారు కాబట్టి ఆ వ్యర్థాలతోపాటు ఇతర వ్యర్థాలను తొలగిస్తోంది. ఇది చూసినవారికి బుద్ధి వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్..
ఈ వీడియోను కర్ణాటకు చెందిన ఆదర్శ్ హెగ్డే ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ‘ఓ మహిళ ఇలా చెత్తను తీసి చెత్త బుట్టలో వేస్తోంది.. ఆమె పని కాకపోయినా చేస్తోంది.. హ్యాట్సాప్’ అని కామెంట్ పెట్టాడు. ఈ వీడియో కర్ణాటకతోపాటు అటూ ఇటూ తిరిగి వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు చేరింది. స్పందించిన ఆయన ‘రియల్ హీరో.. కీపింగ్ భారత్ స్వచ్ఛ్’ అనే క్యాప్షన్‌తో రీట్వీట్ చేశారు. ఆమె చేస్తున్న పని పదిమందికి ఇన్‌స్ప్రేషన్‌గా మారాలి.. ఆమె పనిని దేశానికి చూపించాలి.. ఆమె ఎవరు.. ఎక్కడ ఉంటుందో తెలుసుకుని నాకు కాల్ చేయండి.. నేను ఆమెతో మాట్లాడాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఆ సాధారణ మహిళ చేస్తున్న చిన్న పని కోట్లాది మంది మన్ననలు పొందుతోంది. ప్రతి ఒక్కరూ ఈమెలాగే బాధ్యతగా స్వచ్ఛభారత్‌ను చేపడితే పర్యావరణాన్ని కాపాడినవారం అవుతాం.