Chandra Mohan: దశాబ్దాలుగా ఇండస్ట్రీ లో ఉంటూ లెజండరీ స్థానం ని సొంతం చేసుకున్న అతి తక్కువ మంది లో ఒకరు చంద్ర మోహన్..హీరో గా క్యారక్టర్ ఆర్టిస్టు గా ఈయనకి ఉన్న ట్రాక్ రికార్డు టాలీవుడ్ లో చాలా మంది ఆర్టిస్టులకు లేదనడం లో ఎలాంటి సందేహం లేదు..1966 వ సంవత్సరం లో రంగుల రత్నం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు..ఆ తర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు.

ఈయన సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు..వారిలో శ్రీదేవి కూడా ఒకరు..ఈమె పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్థాయి లో స్టార్ స్టేటస్ ని దక్కించుకుందో అందరికి తెలిసిందే..చంద్ర మోహన్ హీరో గా తెరకెక్కిన ’16 ఏళ్ళ వయస్సు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..అప్పట్లో ఈ సినిమా ఒక ప్రభంజనం..చంద్ర మోహన్ కెరీర్ కి కూడా ఆ చిత్రం మంచి బూస్ట్ ని ఇచ్చింది.
ఇక ఆ తర్వాత ఆయన హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించాడు..అయితే కొన్నాళ్ళకు కొత్త హీరోల రాకతో క్రేజ్ ని కోల్పోతూ వచ్చిన చంద్ర మోహన్ ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చాడు..అయితే కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ప్రశాంతవంతమైన జీవితం ని గడుపుతున్నారు..అయితే చాలాకాలం తర్వాత ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు చంద్ర మోహన్..ఈ ఇంటర్వ్యూ లో ఆయన జీవితం లో చేసిన ఒక్క పెద్ద పొరపాటు గురించి చెప్పుకొని బాధపడ్డాడు.

ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో శోభన్ బాబు గారు నా మంచి కోరి చెప్పిన ఒక మాట ని లెక్క చెయ్యలేదు..ఫలితంగా 100 కోట్ల రూపాయిలు నష్టపోయాను..సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు గారి మాట విని కొంపల్లి వద్ద 35 ఎకరాలున్న ద్రాక్ష తోట ని కొన్నాను..కానీ ఆ ప్రాంతం లో రౌడీయిజం ఎక్కువ ఉండేది..కబ్జాలు జరుగుతూ ఉండేవి..నా ద్రాక్ష తోట మీద వాళ్ళ కన్నుపడింది..అది కబ్జాకి గురి అవ్వడం ఇష్టం లేక అమ్మేసాను..శోభన్ బాబు గారు భవిష్యత్తులో అవి కోట్ల విలువ చేస్తాది..అమ్మొద్దు అంటూ ఎంత చెప్పిన వినకుండా అమ్మేసాను..ఇప్పుడు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది..వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర మోహన్.