https://oktelugu.com/

Anchor Ravi: అమ్మాయిల కోసమే పెళ్లి విషయం దాచాను… యాంకర్ రవి సెన్సేషనల్ కామెంట్స్

Anchor Ravi: తెలుగు టాప్ యాంకర్స్ లో రవి ఒకరు. చాలా కాలంగా ఆయన పరిశ్రమలో ఉన్నాడు. అయితే గతంతో పోల్చితే ఆయన జోరు తగ్గింది. అతికొద్ది షోలలో మాత్రమే కనిపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీరు డౌన్ అయ్యారని ఎవరైనా అంటే నేను ఒప్పుకోనని రవి అన్నారు. మనకు మనం ఫీల్ అయ్యే వరకు మనం కింద పడినట్లు కాదు. ఇప్పటికీ నేను కొన్ని షోలు చేస్తున్నాను. రెండు […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2023 / 07:55 AM IST
    Follow us on

    Anchor Ravi

    Anchor Ravi: తెలుగు టాప్ యాంకర్స్ లో రవి ఒకరు. చాలా కాలంగా ఆయన పరిశ్రమలో ఉన్నాడు. అయితే గతంతో పోల్చితే ఆయన జోరు తగ్గింది. అతికొద్ది షోలలో మాత్రమే కనిపిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీరు డౌన్ అయ్యారని ఎవరైనా అంటే నేను ఒప్పుకోనని రవి అన్నారు. మనకు మనం ఫీల్ అయ్యే వరకు మనం కింద పడినట్లు కాదు. ఇప్పటికీ నేను కొన్ని షోలు చేస్తున్నాను. రెండు సినిమాలు చేశాను. అవి వర్క్ అవుట్ కాలేదు. ఎవరి సప్పోర్ట్ లేకుండా పరిశ్రమకు వచ్చి యాంకర్ గా ఎదిగాను. ఎన్నడూ సింపతీ కార్ట్ వాడలేదని చెప్పుకొచ్చారు.

    ఇక బిగ్ బాస్ ఎంట్రీ మీద మాట్లాడుతూ… గత నాలుగు సీజన్స్ నుండి నన్ను అడుగుతున్నారు. కానీ వెళ్ళలేదు. ఈసారి డబ్బుకు లొంగిపోయాను. అందుకే షోలో అడుగుపెట్టాను. కొన్నాళ్ళు ఉన్నాను. ఎలిమినేటై బయటకు వచ్చాక తెలిసింది ఏం జరుగుతుందో. కొందరు రివ్యూవర్స్ నా మీద కక్ష కట్టారు. లేనిపోనివి ప్రచారం చేశారు. అది నాకు మైనస్ అయ్యింది. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాక నా ఆలోచనా విధానం మారిందని, ఆయన అన్నారు.

    లేడీ ఫ్యాన్స్ కోసం పెళ్ళైన విషయం దాచినట్లు యాంకర్ రవి చెప్పడం ఆసక్తి రేపింది. నేను యాంకర్ గా ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు. యాంకర్ లాస్యతో చేసిన ‘సంథింగ్ స్పెషల్’ షో ట్రెమండస్ సక్సెస్ అయ్యింది. టీఆర్పీ 7 నుండి 14 కి పెరిగింది. అప్పుడే నాకు పెళ్లైంది. ఆ విషయం అమ్మాయిలకు తెలిస్తే ఫాలోయింగ్ తగ్గుతుందన్న భయం వేసింది. కారణం ఆ షో చూసేది అమ్మాయిలే. పెళ్లయిందని తెలిస్తే యూత్ ఫీలింగ్ పోయి అంకుల్ అన్న భావన వస్తుంది. లేడీ ఫ్యాన్స్ కోసమే పెళ్లి విషయం దాచాల్సి వచ్చిందని యాంకర్ రవి ఉన్న విషయం బయట పెట్టాడు.

    Anchor Ravi

    యాంకర్ రవి దంపతులకు ఒక అమ్మాయి. బిగ్ బాస్ హౌస్లో రవి ఓ కాంట్రవర్సీ ఎదుర్కొన్నాడు. కంటెస్టెంట్ లహరి పెళ్ళైన తన వెనుకపడుతుందని రవి తనతో చెప్పినట్లు మరో కంటెస్టెంట్ ప్రియ ఆరోపించారు. తాను అలా అనలేదని యాంకర్ రవి బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే వీకెండ్ లో నాగార్జున ఈ పంచాయితీ మీద తీర్పు ఇచ్చాడు. ప్రియతో రవి ఆ మాట అన్న వీడియో బయటకు తీసి ప్లే చేశాడు. దాంతో రవి అబద్ధం ఆడాడన్న విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5లో రవి పాల్గొన్నాడు. సన్నీ ఆ సీజన్ విన్నర్ గా అవతరించాడు.