Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam Metro Rail Project: బాబు ఉంటే నిధులొస్తాయి.. విశాఖ తలరాత ఇలా మారుతుంది..

Visakhapatnam Metro Rail Project: బాబు ఉంటే నిధులొస్తాయి.. విశాఖ తలరాత ఇలా మారుతుంది..

Visakhapatnam Metro Rail Project: కేంద్రం నుంచి విశాఖకు( Visakhapatnam ) మరో గుడ్ న్యూస్ వచ్చింది. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ విషయం తెలిసింది. ఒకరోజు పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ప్రపంచ దిగ్గజ సంస్థలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి ఏర్పాటు అవుతుండడంతో.. పెరిగిన ట్రాఫిక్ ను నియంత్రించేందుకు విశాఖకు అత్యవసరంగా మెట్రో ప్రాజెక్టు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

* విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజనతో.. విభజన హామీల్లో భాగంగా ఏపీకి మెట్రో రైలు ప్రాజెక్టులు( metro rail projects) మంజూరు చేయాలని కేంద్రం భావించింది. కానీ పుష్కరకాలంగా అది సాధ్యం కాలేదు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడతో పాటు విశాఖలో మెట్రో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. ఇప్పటికే డిపిఆర్ ను పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతో.. విశాఖకు మెట్రో రైల్వే లైన్ మంజూరుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇది నిజంగా ఏపీకి శుభవార్త.

* ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా..
ప్రస్తుతం ఏపీలో విశాఖ ప్రాధాన్యత కలిగిన నగరంగా ఉంది. ముఖ్యంగా పర్యాటక నగరం. అందుకే వాణిజ్య రాజధానిగా విశాఖను కూటమి ఎంచుకుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలతోపాటు పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఐటి హబ్ గా కూడా మారనుంది. పెరుగుతున్న రవాణా అవసరాల రీత్యా విశాఖకు మెట్రో ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. విజయవాడ కంటే ముందుగా విశాఖలోనే మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మూడు కారిడార్లతో దాదాపు 40 ఆరు కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి కేంద్ర రైల్వే శాఖ అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 11,500 కోట్ల రూపాయలతో ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మొదలవుతాయని అంచనాలు ఉన్నాయి.
* విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వద్ద ఉన్న కొమ్మాది దాకా ఒక కారిడార్ ఉండనుంది. ఇది దాదాపు 35 కిలోమీటర్ల దూరంతో సాగుతుంది.
* గురుద్వారా జంక్షన్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ దాకా ఉన్న ఆరు కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ సాగుతుంది. నగరానికి ఇదే కీలకపాయింట్.
* మూడో కారిడార్ కేవలం టూరిజను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. తాటి చెట్ల పాలెం నుంచి రామకృష్ణ బీచ్ దాకా ఇది కొనసాగనుంది. అంటే నగరంలోని జనాలు నేరుగా పర్యాటక ప్రాంతాలకు చేరుకునేలా ఈ క్యారిడార్ ఉండనుంది. మొత్తానికి అయితే విశాఖలో మెట్రో ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Heavy Rains: ఏపీకి భారీ వాయుగుండం.. అయినా సరే!

AP Heavy Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండం గా మారింది. ప్రస్తుతం ఉత్తరం వైపు ప్రయాణిస్తూ ఒడిస్సాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈరోజు...

TDP MLC Candidates: ఆశావహులు 20 మంది.. టిడిపిలో ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవి!

TDP MLC Candidates: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం అయింది. గత వైసిపి ప్రభుత్వంలో గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. మండలి డిప్యూటీ చైర్...

ADR Report 2026: ఏడీఆర్ నివేదిక: ఆ విషయంలో రేవంత్ ను ఎవరూ బీట్ చేయలేరు..

ADR Report 2026: దేశంలో రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు.. వారు సంపాదించిన ఆస్తులు.. ఇతర వ్యవహారాల మీద ఎప్పటికప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రి ఫార్మ్స్ అనే సంస్థ...

West Indies vs Pakistan: పాపం పాకిస్తాన్.. వెస్టిండీస్ బౌలర్ గ్రీవ్స్ దెబ్బకు తోక ముడిచింది..

West Indies vs Pakistan: ఆ బంతులు బుల్లెట్లు.. చూస్తుండగానే వికెట్లను పడగొట్టాయి. చూస్తుండగానే వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాయి.. చూస్తుండగానే బ్యాటర్లకు నరకం చూపించాయి. ఇదంతా కూడా ఒక్కడు చేసిన అద్భుతం....

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
Oktelugu Epaper
Exit mobile version