https://oktelugu.com/

Taraka Ratna: తారకరత్న ఏకంగా సీఎం భార్యతో రొమాన్స్ చేశాడా? బయటకొచ్చిన షాకింగ్ మేటర్!

Taraka Ratna: తారకరత్న ఈ లోకాన్ని విడిచి నెల రోజులు కావస్తుంది. ఆయనను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. హీరోగా సక్సెస్ కాకున్నా గొప్ప హ్యూమన్ బీయింగ్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. తారకరత్న గురించి ఎవరిని అడిగినా మంచిగానే చెబుతారు. ఆయనకు అజాత శత్రువు అనే పేరుంది. జనవరి 27న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజుల పాటు ఆయనకు చికిత్స అందించారు. ప్రధాన అవయాలు పనితీరు మెరుగైనప్పటికీ మెదడులో తీవ్ర […]

Written By:
  • Shiva
  • , Updated On : March 21, 2023 / 08:00 AM IST
    Follow us on

    Taraka Ratna

    Taraka Ratna: తారకరత్న ఈ లోకాన్ని విడిచి నెల రోజులు కావస్తుంది. ఆయనను అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. హీరోగా సక్సెస్ కాకున్నా గొప్ప హ్యూమన్ బీయింగ్ గా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. తారకరత్న గురించి ఎవరిని అడిగినా మంచిగానే చెబుతారు. ఆయనకు అజాత శత్రువు అనే పేరుంది. జనవరి 27న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. బెంగుళూరు హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజుల పాటు ఆయనకు చికిత్స అందించారు. ప్రధాన అవయాలు పనితీరు మెరుగైనప్పటికీ మెదడులో తీవ్ర సమస్య ఏర్పడింది. ఆ కారణంగా ఆయన మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న కన్నుమూశారు.

    Also Read: Anchor Ravi: అమ్మాయిల కోసమే పెళ్లి విషయం దాచాను… యాంకర్ రవి సెన్సేషనల్ కామెంట్స్

    ఈ క్రమంలో ఆయన చేసిన సినిమాలు, సాధించిన విజయాల గురించి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తారకరత్న మూవీలో మాజీ ముఖ్యమంత్రి భార్య హీరోయిన్ గా చేసింది. ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే కుమారస్వామి. కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి భార్య కుట్టి రాధిక తారకరత్నకు జంటగా నటించారు. 2004లో భద్రాద్రి రాముడు టైటిల్ తో తారకరత్న ఒక చిత్రం చేశారు.

    ఈ చిత్ర హీరోయిన్ కుట్టి రాధిక అలియాస్ రాధికా కుమారస్వామి. అప్పటికి కుమార స్వామితో ఆమెకు వివాహం కాలేదు. సీనియర్ నటి వాణిశ్రీ కీలక రోల్ చేసిన భద్రాద్రి రాముడు పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు రాధిక కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. కుట్టి రాధికకు ఇది రెండో వివాహం. ఆమె మొదటి భర్త మరణించారు. రెండో వివాహంగా కుమారస్వామిని చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రాధిక కెరీర్ కొనసాగిస్తున్నారు.

    Taraka Ratna

    భద్రాద్రి రాముడు మూవీ అనంతరం చాలా గ్యాప్ తర్వాత 2014లో అవతారం అనే తెలుగు మూవీలో నటించారు. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే చివరి చిత్రం. అవతారం అనుకున్నంతగా ఆడలేదు. రాధిక కుమారస్వామి కన్నడలో ఎక్కువగా సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన భైర దేవి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. రాధిక కుమారస్వామికి ఒక అమ్మాయి సంతానం. కుమారస్వామికి మొదటి భార్యతో ఒక అబ్బాయి సంతానంగా ఉన్నాడు.

    Also Read:Nikita Dutta : వేదికపైకి ఎక్కాక హీరోయిన్ డ్రెస్ జారింది.. అంతా షాక్ లగా