Homeబిజినెస్TVS Apache RTR 160: యువకుల డ్రీమ్‌ బైక్‌.. ధర తక్కువ.. మైలేజ్‌ ఎక్కువ!

TVS Apache RTR 160: యువకుల డ్రీమ్‌ బైక్‌.. ధర తక్కువ.. మైలేజ్‌ ఎక్కువ!

TVS Apache RTR 160: మధ్య తరగతి ప్రజలు బైక్‌ లేదా కార్‌ కొనాలంటే వారు ముందుగా చూసేది మైలేజ్‌. తర్వాత ధర. ఈ రెండు తమ బడ్జెట్‌లో ఉంటేనే కొనేందుకు ముందుకు వస్తారు. దేశీయ మోటార్‌ సంస్థ టీవీఎస్‌ ఇప్పుడు మధ్య తరగతి యువతను దృష్టిలో పెట్టుకుని ఓ డ్రీమ్‌ బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్టైల్, శక్తి, సామర్థ్యం కలిగిన బైక్‌ కావాలంటే TVS Apache RTR 160 ఎంపిక చేసుకోవచ్చంటోంది. ఈ స్పోర్టీ మోడల్‌ నగర రోడ్లు, హైవేలకు సరిపోతూ, లీటర్‌ పెట్రోల్‌తో దీర్ఘ దూరాలు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది.

బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్‌..
TVS Apache RTR 160 బైక్‌ ఎక్స్‌–షోరూమ్‌ ధర రూ.1.01 లక్షల నుంచిరూ.1.23 లక్షల వరకు ఉంటుంది. RM డ్రమ్, RM డిస్క్‌ BT, రేసింగ్‌ ఎడిషన్, డ్యూయల్‌ ABS వంటి వేరియంట్‌ ఫీచర్లు ఉన్నాయి. బడ్జెట్‌ ప్రకారం ఎంచుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది బడ్జెట్‌ ఫ్రెండ్లీ బైక్‌.

ఆధునిక డిజైన్‌.. అదిరిపోయే లుక్‌..
అగ్రెసివ్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డీఆర్‌ఎల్‌లు, స్టైలిష్‌ టెయిల్‌ లైట్‌తో యువ స్పిరిట్‌ను ప్రతిబింబిస్తుంది. డిజిటల్‌ క్లస్టర్‌లో నావిగేషన్, క్రాష్‌ అలర్ట్‌ ఉన్నాయి. స్పోర్ట్స్, అర్బన్, రెయిన్‌ మోడ్‌లు రైడింగ్‌ను సులభతరం చేస్తాయి.

శక్తివంతమైన ఇంజిన్‌..
159.7 సీసీ ఎయిర్‌–కూల్డ్‌ ఇంజిన్‌ 16.04 బీహెచ్‌పీ పవర్, 13.85 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5–స్పీడ్‌ గెయర్‌బాక్స్‌తో స్మూత్‌ పెర్ఫార్మెన్స్‌. మైలేజ్‌ 41–50 కిలోమీటర్లు. 12 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌తో 600 కి.మీ. రేంజ్‌. తక్కువ నిర్వహణతో రోజువారీ ఉపయోగానికి గొప్పది.

టెలిస్కోపిక్‌ ఫోర్కులు, మోనోషాక్‌ సస్పెన్షన్‌ స్థిరమైన రైడ్‌ ఇస్తాయి. డ్యూయల్‌–ఛానల్‌ ఏబీస్, డిస్క్‌/డ్రమ్‌ బ్రేకులు భద్రతను నిర్ధారిస్తాయి. నగరం, లాంగ్‌ రైడ్‌లకు పర్ఫెక్ట్‌ బైక్‌ ఇదీ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version