Anasuya Bharadwaj: ఈ మధ్య అనసూయ యాటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. తనను ట్రోల్ చేసే వారికి సోషల్ మీడియా వేదిక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మీ ట్రోల్స్, మీమ్స్, నెగిటివ్ కామెంట్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపవని చెబుతుంది. తాజాగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో… ‘నాకు ఓ డిజాస్టర్ ఉంది. అది ఏమిటంటే నిజాలు చెప్పడం, నెగిటివ్ పీపుల్ ని లెక్క చేయకపోవడం’ అంటూ కామెంట్స్ చేశారు. ఎవరు ఏమనుకున్నా నేను నేనుగానే ఉంటాను. నిజాలు చెప్తాను. ఇక జనాల కామెంట్స్ ని, ట్రోల్స్ ని పట్టించుకోనని షార్ట్ గా చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ ఆ మారింది.

ఇక అనసూయ వీడియోకి నెటిజెన్స్ స్పందిస్తున్నారు. కొందరైతే జబర్దస్త్ కి తిరిగి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. జబర్దస్త్ షోకి రీ ఎంట్రీ ఇవ్వడంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులు అనసూయను మిస్ అవుతున్నారనేది నిజం. ఆమె పూర్తిగా యాంకరింగ్ వదిలేయడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. యాక్టింగ్ పై దృష్టిపెట్టిన అనసూయ బుల్లితెరను మొత్తంగా వదిలేశారు.
పక్కా కమర్షియల్ గా ఆలోచిస్తూ ఎక్కువ డబ్బులు, ఫేమ్ వచ్చే మార్గం వెతుకున్నారు. ఆ విషయంలో అనసూయను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా జీవితంలో బెటర్మెంట్ కోరుకుంటారు. అనసూయ అదే చేస్తుంది. జబర్దస్త్ వలన ఆమెకు వచ్చే పారితోషికం నెలకు పది లక్షల లోపే ఉంటుంది. సినిమాలకైతే కాల్ షీట్ కి రూ. 3 లక్షలు పైనే తీసుకుంటున్నారు. ఆమెకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా రోజుకు రెండు మూడు కాల్ షీట్స్ వర్క్ చేయొచ్చు.

మొత్తంగా అనసూయ ప్రస్తుత సంపాదన నెలకు కోటి రూపాయల పైనే. ఒక దశలో అనసూయ అర్థ రూపాయి మిగల్చడం కోసం కిలోమీటర్ కి పైగా నడిచి వెళ్లి నెక్స్ట్ స్టాప్ లో బస్సు ఎక్కేదట. ఇప్పుడు ఆమెకంటూ హైదరాబాద్ లో లగ్జరీ హౌస్. ఖరీదైన కార్లు, బ్యాంకు బ్యాలెన్స్ వచ్చిపడ్డాయి. ఏదైనా కష్టపడితేనే దక్కుతాయి. న్యూస్ రిపోర్టర్ నుండి యాంకర్ గా మారి అనసూయ తన ఫేట్ మార్చుకుంది. జబర్దస్త్ షోకి యాంకర్ కావడం ఆమెకు కలిసొచ్చింది. ఆ షో సక్సెస్ కావడంతో యాంకర్స్, కమెడియన్స్, జడ్జెస్ అందరి జీవితాలు సెట్ అయ్యాయి.
View this post on Instagram