Junior NTR: సోషల్ మీడియా నెగిటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. నచ్చని వ్యక్తిలోని లోపాలు వెతికి, లొసుగులు చూపించి విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. సున్నిత మనస్కులు ఈ సోషల్ మీడియా దూషణను తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం సస్పెండ్ చేశారు. కన్నడ జనాలు అకారణంగా ఆయన్ని తిడుతూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమాలకు దూరమయ్యారు. సినిమా ప్రముఖులు విపరీతమైన విద్వేషానికి గురవుతున్నారు. హ్యాష్ ట్యాగ్ యాడ్ చేతి తమ పేరు సెర్చ్ చేస్తే అన్నీ బూతులు, ఎగతాళి చేసే మాటలు, బెదిరింపులు ఇలా… నెగిటివిటీ ఎక్కువైపోయింది.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంగ్లీష్ యాక్సెంట్ ని తప్పుబడుతూ సోషల్ మీడియా ట్రోల్స్ తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారు. అమెరికా వెళ్లినంత మాత్రాన ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అమెరికన్స్ ని అనుకరించాల్సిన పనేంటి? ఒక్క రోజులో మీరు అమెరికన్ ఇంగ్లీష్ పై పట్టుసాధించేరా? అని అనే అనేక నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అమెరికన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వారి యాక్సెంట్ లో మాట్లాడటంలో తప్పేముంది. దాని వలన స్థానికులు తమ భావం, చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఎన్టీఆర్ అమెరికన్ మాదిరి ఇంగ్లీష్ పదాలు పలకడానికి ప్రధాన కారణం అదే. అక్కడ ఆయన అమెరికన్ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన ఇంగ్లీష్ మనవారి యాక్సెంట్ తో సాగుతుంది.

అతి పెద్ద విజయాన్ని ఆస్వాదించడం మానేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం పెట్టుకున్న కొందరిని చూస్తుంటే జాలేస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని విమర్శిస్తూ ఏదో రాక్షసానందం పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సినిమా అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సొంతమైంది. ఈ విషయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. కొందరు మాత్రం అది ఆస్వాదించలేకపోతున్నారు. దుర్వార్తలు, చెడ్డ విషయాలను ఎంజాయ్ చేసే సైకోలు సమాజంలో ఎక్కువపోయారు అనడానికి ఇది నిదర్శనం.
దాదాపు దశాబ్దం తర్వాత మరో ఇండియన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు ఆసియాలోనే మొదటిది. ఇదంతా ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, చరణ్ శ్రమ ఫలితం. అది గుర్తించకుండా అనవసర విషయాలు లేవనెత్తి ట్రోల్ చేయడం దిగజారుడుతనమే అవుతుంది.