
Shruti Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ డాటర్ శృతి హాసన్ వెరీ బోల్డ్. ఆమె ఇతర హీరోయిన్స్ మాదిరి చాటు మాటు వ్యవహారాలు నడపదు. ఏదైనా ఓపెన్ గానే చేస్తుంది. సొసైటీ, రూల్స్, కస్టమ్స్ అసలు పట్టించుకోదు. మై లైఫ్ మై రూల్స్ అంటుంది. కెరీర్ బిగినింగ్ నుండి శ్రుతి హాసన్ మీద చాలా ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. ఒకరిద్దరు కోలీవుడ్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక లండన్ కి చెందిన మైఖేల్ కోర్ల్సే తో శ్రుతి హాసన్ ఓపెన్ గానే ఎఫైర్ నడిపింది. రెండు మూడేళ్లు ఈ జంట చెట్టపట్టాలేసుకుని తిరిగారు.
ఒకటి రెండు సార్లు మైఖేల్ చెన్నై వచ్చాడు. శృతి హాసన్ కుటుంబ సభ్యులను కలిశాడు. దీంతో త్వరలో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. కారణం తెలియదు కానీ 2019లో లెట్స్ బ్రేకప్ అన్నారు. మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదులుకుంది. సినిమా పరిశ్రమకు దూరమైంది. ఆమె త్యాగానికి దక్కిన ఫలితం ఎడబాటు. మైఖేల్ ఆలోచనల నుండి బయటపడేందుకు మరలా యాక్టింగ్ షురూ చేశారు.
అప్పుడు టాలీవుడ్ ఆమెను అక్కున చేర్చుకుంది. క్రాక్, వకీల్ సాబ్, సలార్ వంటి చిత్రాలతో బిజీ అయ్యారు. ఒక్క ఏడాది గ్యాప్ ఇచ్చి మరో ప్రియుడిని వెతుక్కుంది. ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో గత రెండేళ్లుగా శృతి సహజీవనం చేస్తుంది. ముంబైలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. తన లవర్ తో రొమాంటిక్, చిల్లింగ్ మూమెంట్స్ ఫ్యాన్స్ తో శృతి షేర్ చేస్తుంటారు.

అయితే శృతి హాసన్ ఫస్ట్ క్రష్ అండ్ లవ్ మాత్రం బ్రూస్లీ అట. ఆ వరల్డ్ ఫేమస్ ఫైటర్ అంటే శృతి పడిసచ్చిపోయేవారట. ఈ విషయాన్ని శృతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నీ ఫస్ట్ క్రష్ హీరో ఎవరని అడగ్గా.. .శృతి హాసన్ హీరో బ్రూస్లీ పేరు చెప్పారు. నిజానికి శృతి హాసన్ పుట్టకముందే బ్రూస్లీ మరణించాడు. అయినప్పటికీ ఆయన సినిమాలు చూసి క్రష్ ఫీలింగ్ కలిగిందట. ఇక శృతి లేటెస్ట్ మూవీస్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి భారీ విజయాలు సాధించాయి.