
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్ నకు లైంగిక ఉచ్చు బిగుసుకుంటున్నది. పోర్న్ స్టార్మీ డేనియల్స్ తో తనకు ఉన్న లైంగిక సంబంధం బయటకు రాకుండా ఉండేందుకు 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ఆమెకు డబ్బులు ఇచ్చి ఒప్పందం చేసుకున్న కేసులో ట్రంప్ పై మన్ హటాన్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది.. దీంతో ఇది అమెరికా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంతో అమెరికా చరిత్రలోనే అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఈ క్రమంలో అతడి అరెస్టు తప్పదనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయనకు గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గ్రాండ్ జ్యూరీ నేరారోపణ నేపథ్యంలో మన్ హటాన్ జిల్లా అటార్నీ కార్యాలయం ట్రంప్ న్యాయవాదులను సంప్రదించింది. ఆయన లొంగిపోవడానికి వీలుగా ఒక తేదీని ఎంచుకోవాలని, ఆ తర్వాత సంగతి తాను చూసుకుంటామని అటార్నీ ప్రతినిధి చెబుతున్నారు.. రేపు ఈ వ్యవహారం నేపథ్యంలో ట్రంప్ తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా తన గెలుపును జీర్ణించుకోలేక చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. టానికి ఎవరూ అతీతులు కాదని, తనపై ప్రజలకు ఉన్న ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ కు వ్యతిరేకంగా కేసులు నమోదు కావడం ఇది కొత్త కాదు. 2021లో యూఎస్ కాంగ్రెస్ పై దాడికి ఉసిగొలిపిన కేసు, వైట్ హౌస్ కి సంబంధించిన కీలక పత్రాల మిస్సింగ్ కేసు కూడా ఆయనపై ఉంది.
ఎవరు ఈ డేనియల్స్
44 ఏళ్ల స్టార్మీ డేనియల్స్.. అసలు పేరు స్టీఫనీ క్లిఫర్డ్. లూసియానాకు చెందిన ఈమె 17 ఏళ్ల వయసులోనే పోర్న్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.. తర్వాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2006లో ట్రంప్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడిన సమయంలో ఆమె పేరు మీడియాలో మార్మోగింది.ఇద్దరి మధ్య వ్యవహారంపై గురించి పలు కార్యక్రమాల్లో డేనియల్స్ మాట్లాడారు..” 2006 జూలైలో గోల్ఫ్ టోర్నమెంట్లో ట్రంప్ ను తొలిసారి కలిశా. ఆయనతో కలిసి భోజనం చేశాను. అనంతరం ఇద్దరం ఏకాంతంగా గడిపాం. మేం ఫోన్లో టచ్ లో ఉండేవాళ్ళం” అంటూ 2018లో ఒక కార్యక్రమంలో ఆమె తెలిపారు.. తనకు 27 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అప్పటికే మెలానియాను ట్రంప్ మూడో పెళ్లి చేసుకున్నాడు. మెలానియాకు బాబు పుట్టిన తర్వాత కూడా ట్రంప్ తనను కలిసినట్టు డేనియల్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక 2016లో అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్ గెలిచారు. ఎన్నికల ప్రచార సమయంలోనే ట్రంప్ లాయర్ డేనియల్స్ తో ఒప్పందం కుదురుచుకున్నారు. ట్రంప్ తో లైంగిక సంబంధాల విషయం బయట పెట్టకుండా ఉండేందుకు ఆమెకు 1.30 లక్షల డాలర్లు సమకూర్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అది చెల్లదంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ట్రంప్ పై నేరారోపణలను ధ్రువీకరించింది. 2023 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనపై నేరాభియోగాలు నమోదు కావడం విశేషం. ట్రంప్ పోటీ చేసేందుకు ఇబ్బంది లేకున్నా ప్రచార సమయంలో చర్చల సందర్భంగా ఆయన ఇరుకున పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిచినా జైలు నుంచే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
Thank you to everyone for your support and love! I have so many messages coming in that I can’t respond…also don’t want to spill my champagne 😜 #Teamstormy merch/autograph orders are pouring in, too! Thank you for that as well but allow a few extra days for shipment.
— Stormy Daniels (@StormyDaniels) March 30, 2023