https://oktelugu.com/

Deepthi Sunaina: ఎలా చెప్పాలో తెలియడం లేదు… టెన్షన్ పెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్ దీప్తి పోస్ట్

Deepthi Sunaina: వరుస సోషల్ మీడియా పోస్ట్స్ తో దీప్తి సునైన వార్తల్లో నిలిచింది.నిఘాడం గా ఉన్న ఆమె కామెంట్స్ ద్వందార్థాలకు దారితీశాయి. దీంతో ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాగా సస్పెన్సులో పడ్డారు. మెజారిటీ ఫ్యాన్స్ ప్రేమ, పెళ్లి గురించి ఏదైనా కొత్త విషయం పంచుకోబోతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీప్తి ‘గయ్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు’ అని కామెంట్ పోస్ట్ చేసింది. దీప్తి అంతగా సంకోచించే విషయం ఏమై ఉంటుందని ఫ్యాన్స్ లో ఆత్రుత […]

Written By:
  • Shiva
  • , Updated On : January 19, 2023 / 10:51 AM IST
    Follow us on

    Deepthi Sunaina: వరుస సోషల్ మీడియా పోస్ట్స్ తో దీప్తి సునైన వార్తల్లో నిలిచింది.నిఘాడం గా ఉన్న ఆమె కామెంట్స్ ద్వందార్థాలకు దారితీశాయి. దీంతో ఆమె ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాగా సస్పెన్సులో పడ్డారు. మెజారిటీ ఫ్యాన్స్ ప్రేమ, పెళ్లి గురించి ఏదైనా కొత్త విషయం పంచుకోబోతుందా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీప్తి ‘గయ్స్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు’ అని కామెంట్ పోస్ట్ చేసింది. దీప్తి అంతగా సంకోచించే విషయం ఏమై ఉంటుందని ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగింది. మళ్ళీ దీప్తి సునైన-షణ్ముఖ్ కలిసిపోయారనే వాదనలు వినిపిస్తున్న క్రమంలో ఆమె పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

    Deepthi Sunaina

    దాదాపు ఏడాది కాలం వేరువేరుగా ఉన్న దీప్తి సునైన-షణ్ముఖ్ కలిసి ఈవెంట్ చేశారు. వైజాగ్ లో ఓ ఈవెంట్లో జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటిసారి దీప్తి గురించి షణ్ముఖ్ మాట్లాడారు. దీప్తి మంచి అమ్మాయి. చాలా మందికి స్ఫూర్తి ఇచ్చే అమ్మాయి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అనంతరం ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశాడు. హ్యాపీ బర్త్ డే ‘డి’ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వీడి ఒక్కటయ్యారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

    ఈ బంధం గురించే దీప్తి చెప్పాలనుకుంటున్నారేమో అనుకున్నారు. షణ్ముఖ్ తో బ్రేకప్ గురించి కూడా ఆమెనే ఓపెన్ అయ్యారు. సోషల్ మీడియాలో సందేశం పోస్ట్ చేశారు. అయితే దీప్తి చెప్పాలనుకున్న మేటర్ మాత్రం… తన కొత్త సాంగ్ రిలీజ్ గురించి. దీప్తి యూట్యూబ్ లో ఓ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ని తనదైన శైలిలో ప్రమోట్ చేశారు. ఎలా చెప్పాలో తెలియడం లేదని దీప్తి చెప్పింది, ఆ సాంగ్ గురించే. దీప్తి తెలివితేటలతో సదరు సాంగ్ కి మంచి ప్రచారం దక్కింది.

    Deepthi Sunaina

    ఇక దీప్తి కొత్త సాంగ్ రోజు గడవకుండానే వన్ మిలియన్ కి పైగా వ్యూస్ రాబట్టింది. అసలు విషయం తెలిశాక జనాలు ఉసూరుమన్నారు. కాగా దీప్తి-షణ్ముఖ్ ఐదేళ్లకు పైగా రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం. యూట్యూబ్ వేదికగా మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి పాల్గొన్నారు. ఇక సీజన్ 5లో షణ్ముఖ్ పాల్గొనడం జరిగింది. షణ్ముఖ్ రన్నర్ కావడం విశేషం. బిగ్ బాస్ హౌస్లో షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరితో రొమాన్స్ చేశాడు. ఆ కారణంగానే దీప్తి-షణ్ముఖ్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే వాదన ఉంది.

    Tags