HBDNTR: ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల గొడవ.. పోలీసుల లాఠీఛార్జ్.. ఏం జరిగిందంటే?

HBD NTR:‘ఆర్ఆర్ఆర్’తో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి దేశవ్యాప్తంగా అభిమానులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. దీంతో ఆయన అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతాకాదు.. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అభిమానులే కనిపిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామజపమే కొనసాగుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. తారక్ ఇవాళ 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో, యంగ్ […]

Written By: NARESH, Updated On : May 20, 2022 2:27 pm
Follow us on

HBD NTR:‘ఆర్ఆర్ఆర్’తో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి దేశవ్యాప్తంగా అభిమానులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. దీంతో ఆయన అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతాకాదు.. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ అభిమానులే కనిపిస్తున్నారు. వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామజపమే కొనసాగుతోంది.

ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండుగ రోజు. తారక్ ఇవాళ 39వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో, యంగ్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంోలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటి ముందు హడావుడి చేస్తున్నారు.

ఎన్టీఆర్ ను కలిసేందుకు ఎగబడడం.. అభిమానులు గొడవకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. అభిమానులను చెదరగొట్టారు. దీంతో ఎన్టీఆర్ ఇంటి ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇక తారక్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాను ప్రకటించారు. #NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో కొరటాల దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా అని ఒక వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సంచలన విజయం సాధించింది. పవర్ ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్టు వీడియో చూస్తే అర్థమవుతోంది.

ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ అప్డేట్ అభిమానులకు కనువిందు చేసింది. ఎన్టీఆర్ డైలాగులు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయి.


Recommended Videos