https://oktelugu.com/

Extramarital Affair: భర్త ప్రాణం తీసిన భార్య వివేహేతర సంబంధం.. సెల్ఫీ వీడియోతో విషయం వెలుగులోకి..

ఎన్ని పంచాయితీలు నిర్వహించినా, ఎంత మంది చెప్పినా సౌజన్య ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మెట్టింట్లో భర్తతో.. పుట్టిన ఊరిలో ఉపాధ్యాయుడితో సుఖ సంసారం చేస్తోంది

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 23, 2023 / 07:17 PM IST
    Follow us on

    Extramarital Affair: తెలంగాణలో రోజురోజుకూ దారుణ ఘటనలు కలకం రేపుతున్నాయి.. ఎంతో పవిత్రంగా భావించే వివాహ సంబంధాలు మంట గలుస్తున్నాయి.. అక్రమ సంబంధాలు కారణంగా కాపురాలు కూలడమే కాదు.. హత్యలు, ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి.. హిందూ సాంప్రదాయంలో వివాహా బంధం చాలా గొప్పది. కానీ ఆ గొప్పతనాన్ని చాలామంది పక్కదోవ పట్టిస్తూ వైవాహిక బంధాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తాజాగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే మానసిక ఆందోళనగురైన ఓ భర్త పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

    కరీంనగర్‌ జిల్లాలో ఘటన..
    కరీంనగర్‌ రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్‌ మండలం చామనపల్లికి చెందిన భూసారపు అనిల్‌కుమార్‌(30)కు పదేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.

    పెళ్లి ముందు సంబంధం.. పెళ్లి తర్వాత కొనసాగింపు..
    సౌజన్యకు వివాహానికి ముందునుంచే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా సౌజన్యం ఆ బంధాన్ని రహస్యంగా కొనసాగిస్తూ వస్తోంది. ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన భర్త.. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టిడు. మంచిగా ఉంటానని పంచాయితీ పెద్దలకు సౌజన్య చెప్పినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.

    భార్య మారడం లేదని..
    ఎన్ని పంచాయితీలు నిర్వహించినా, ఎంత మంది చెప్పినా సౌజన్య ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. మెట్టింట్లో భర్తతో.. పుట్టిన ఊరిలో ఉపాధ్యాయుడితో సుఖ సంసారం చేస్తోంది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అనిల్‌ ఈనెల 6న ఇంట్లో గడ్డి మందు తాగిపడిపోయాడు. గమనించిన తల్లి పుష్పలత, భార్య సౌజన్యలు వెంటనే ఆటోలో చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఇంటికి వెళ్లాడు.

    శరీరంలో విస్తరించిన విషం..
    మూడు రోజులకే అనిల్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల 9న కరీంనగర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మరో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు. ఈ క్రమంలో తాను చనిపోవడం ఖాయమనుకున్న అనిల్‌ తన ఆత్మహత్యకు కారణం అందరికీ తెలియాలనుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధమే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియో తీసి పెద్దబావ శ్రీనివాస్‌కు పంపించాడు. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి 2 గంటలకు మృతి చెందాడు. తల్లి పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.