
Actress Karuna Bhushan: కరుణ భూషణ్.. ఈ పేరు చాలామందికి పెద్దగా తెలియపోవచ్చు కానీ, వైదేహీ పరిణయంలో విలన్ అనగానే చాలామంది గృహిణులకు గుర్తొస్తుంది. ఆమెను చూడగానే చాలామంది గుర్తుపడతారు. ఇక తెలుగు సీరియళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలు చేసేవారికి మాత్రం ఆమె చాలా సుపరితం. స్టంట్లు, ఫీట్స్ చేయడంలోనూ కరుణ భూషణ్ ముందుంటుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నాడు. ఆమధ్య ఆమె తిరుమల దర్శనానికి కొడుకుతో వెళ్లారు. దర్శనం అనంతరం బయటకు వస్తుండగా ఎవరో ఆమెనూ షూట్ చేశారు. ఆ సమయంలో ఆమె పైట గాలికి ఎగిరిపోవడంతో నాభి కనిపించింది. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు తన కొడుకుతో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన కొడుకుకు, తనకు ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు చాలా మందికి కోపం కూడా తెప్పిస్తున్నాయి.
ఫ్రెండ్స్‌లా ఉంటాం..
తన కొడుకు, తాను ఫ్రెండ్స్‌లా ఉంటామని కరుణ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే కొడుకు ఇచ్చే కాంప్లిమెంట్స్ గురించి కూడా చెప్పింది. అందంగా రెడీ అయితే సో బ్యూటిఫుల్ అంటాడని, డ్రెస్సింగ్‌లో సెక్సీగా ఉంటే.. మమ్మీ నువ్వు సో సెక్సీ అంటాడని తెలిపింది. అంతేకాదు.. తన కొడుకు చెప్పే కాంప్లిమెట్స్ బాగున్నాయని కితాబిచ్చింది. ఓపెన్‌గా ఉంటాడని వెనుకేసుకొచ్చింది. మెచ్యూరిటిగా ఆలోచిస్తాడని తెలిపింది. ఇంటర్వ్యూలో కూడా యాంకర్ మమ్మీ గురించి ఎక్స్‌ప్రెస్ చేయమని అడినప్పుడు కూడా ఆ బాబు ఆల్‌వేస్ యూ హాట్ అండ్ సెక్సీ అని చెప్పడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక మమ్మీలో నీకిష్టమైంది ఏంటన్న ప్రశ్నకు ఆ బాబు ఆటిట్యూడ్, పర్సనాలిటీ, ఫిజిక్ అని చెప్పడం గమనార్హం.
జంగ్లీ థింగ్స్ చేస్తా..
ఇక కరుణ మాట్లాడుతూ తను కూడా తన కొడుకుతో జంగ్లీ థింగ్స్ చేస్తానని చెప్పారు. కొరుకుతాను, గిల్లతాను, జుట్టు పీకుతాను, హగ్‌చేసుకుంటాను, గట్టిగా పట్టుకుంటాను అంటూ తెలిపారు. బాబుకు కోసం వచ్చినప్పుడు కూడా అరుస్తాడని, గట్టిగా పట్టుకుని నీతో మాట్లాడనని చెప్పి వెళ్లిపోతాడని వెల్లడించింది.

డాడీతో ఫైట్..
ఇక తన కోసం బాబు వాళ్ల డాడీతో కూడా కొట్లాడతాడని కరుణ తెలిపింది. డిస్టర్బ్ చేయనివ్వడని, గట్టిగా మాట్లాడితే సముదాయిస్తాడని, కన్వెన్స్ చేస్తాడని వెల్లడిచింది. మమ్మీ వీక్‌నెస్ లవ్ అని బాబు చెప్పగా, కరుణ మాత్రం బాబే తన స్ట్రెంత్ అని తెలిపింది.
నెటిజన్ల ఆగ్రహం..
ఇక కరుణ ఇంటర్వ్యూపై నెటిజన్లు చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని కరుణతోపాటు ఇంటర్వ్యూ చేసిన టీవీ చానెల్‌యాజమాన్యాన్ని ప్రశ్నించారు. హిందూ ధర్మం ఇదేనా అని కొంతమంది, తల్లిని కొడుకు సెక్సీ అనడం ఏంటి అని మరికొందరు, తల్లిగా నేర్పాల్సిన మాటలు ఇవేనా అని కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా మంది చూస్తున్నారు. షేర్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.