YouTuber Nalini Unagar: ఆన్‌డ్రాయిడ్ ఫోన్ అరచేతిలోకి వచ్చాక. ఇంటర్నెట్ మరింత చౌక అయిన తర్వాత సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో చాలా మందికి సోషల్ మీడియా ఉపాధి కల్పిస్తోంది. కొంత మంది తప్పుగా ఉపయోగిస్తున్నా.. చాలా మంది సరైన రీతిలో వినియోగిస్తూ ఆదాయం పొందుతున్నారు. పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. కొందురు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. కొందరు టెక్నాలజీ సమాచారాన్ని పలువురికి ఉపయోగపడేలా సమాచారం అందిస్తున్నారు. ఇక రాజకీయ, సినిమా గాసిప్ వార్తలు అనేకం యూట్యూబ్‌లో వస్తున్నాయి. ప్రతీ టీవీ ఛానెల్ కూడా ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇలా అనేక మంది ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో ఓ యువతి కూడా వంటల ప్రోగ్రాం యూట్యూబ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ, ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఆశించిన మేరకు ఆదరణ దక్కలేదు. దీంతో ఛానెల్ మూసుకుంది.
ఏం జరిగిందంటే..
నళిని ఉనాగర్ అనే మహిళ దాదపు మూడేళ్లుగా యూట్యూబ్‌లో నళినీస్ కిచెన్ రెసిపీ అనే ఛానల్ నడిపింది. కానీ, ఇటీవలే యూట్యూబ్ కురీర్‌కు వీడ్కోలు పలికింది. ఇంతకాలం ప్రయత్నించినా ఆదాయం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతకాలం శ్రమ వృథా అయిందని పేర్కొంది. ఈమేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది. ‘నేను నా యూట్యూబ్ కెరీర్‌లో విఫలమయ్యాను. అందకే నా కిచెన్ వస్తువులు, స్టూడియో పరికరాలు అమ్మేస్తున్నాను. స్టూడియో, కిచెన్ సెటప్ కోసం రూ.8 లక్షలు ఖర్చు చేశాను. కానీ, మూడేళ్లు కష్టపడినా నాకు వచ్చింది రూ.0’ అని నళిని ట్వీట్‌లో వివరించింది.
ట్వీట్ వైరల్..
నళిని చేసిన వంటల వీడియోలను జనాలు ఎవరూ చూడలేదు.. కానీ ఆదాయం లేదని ఆమె ఛానెల్ మూసేసిన అంశంపై చేసిన ట్వీట్ మాత్రం మస్తు వైరల్ అవుతోంది. ఆమెకి ఊహించనంత రీచ్ తెచ్చింది. నళిని ట్వీట్‌పై చాలా మంది స్పందించారు. ఆకర్షించేలా వంటలు చేయాలని, సబస్క్రిప్షన్ పెంచుకునేలా సర్కిల్ పెంచుకోవాలని, కుబుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వీడియోలు వైరల్ అయ్యేలా చూడాలని పలువురు సూచించారు. కొందరు అయితే ఇప్పటికే చాలా మంది వంటలు చేస్తున్నారు. మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయండి అని సూచించారు. ఇప్పుడు రీచ్ వచ్చింది కదా మరి మళ్లీ ట్రై చేయండి అని కొందరు కామెంట్ చేశారు. ఒకరు తన యూట్యూబ్ చానెల్‌కు 59 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారని, ఇంట్రెస్ట్ ఉంటే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కొందరు ప్రమోషన్‌కు రూ.8 లక్షలు పెట్టే బదులు అందులో సగం నాకు ఇచ్చి ఉంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న యూట్యూబ్ ఛానెల్ వచ్చేది కదా అని సూచించారు.
మళ్లీ ప్రారంభిస్తారా..
ఒక్క ట్వీట్‌లో ఊహించని రీచ్ తెచ్చుకున్న నళిని ఇప్పుడు మళ్లీ వంటలు ప్రారంభిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. అయితే కామెంట్లు పెట్టినవారంతా యూట్యూబ్‌లో ఫాలో కారు. మహిళలు మాత్రమే ఎక్కువగా యూట్యూబ్ ఫాలో అవుతాతరు. కాబట్టి ఆచి తూచి అడుగు వేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.