India History: ప్రపంచ దేశాలతో ఇప్పుడు భారత్ అన్ని రంగాల్లో పోటీ పడుతోంది. ఒకప్పుడు అగ్ర రాజ్యలైన అమెరికా, చైనా దేశాలు భారత్ ఎదుగుదలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉన్న భారత్ కు, ఇప్పటి భారత్ కు చాలా తేడాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా 1000 ఏళ్ల కిందట భారత్ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉండేవి. అఖండ భారత్ గా ఉన్న మన దేశాన్న కొందరు రాజులు దాడి చేసి ముక్కలుగా చేశారు. భారత్ లో ఒకప్పుడు పాకిస్తాన్, కంబోడియా, మలేషియా, బంగ్లాదేశ్, తదితర దేశాలతో కలిసి ఉండేది. వీటన్నింటిని కలిపే భారత్ అని పిలిచేవారు. నాటి నుంచి ఆంగ్లేయుల వరకు భారత్ పైఎంతో మంది దాడి చేసి మక్కలుగా చేశారు. భారత్ లో ఎంత మంది విదేశీ రాజులు, ఆంగ్లేయులు పర్యటించినా. కట్టుబాట్లు మాత్రం అనాధి నుంచి అలాగే వస్తున్నాయి. ముఖ్యంగా జీవన విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరిగాయి. అసలు పురాతన కాలంలో భారత్ ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం.
మిగతా దేశాల కంటే భారత్ కు ఎక్కువ చరిత్ర ఉంది. 1000 ఏళ్ల కిందటే ఇక్కడ చరిత్ర ప్రారంభమైందని కొందరు చెబుతున్నారు. నేటి కాలంలో జీవన విధానం సులభతరం అయింది. కానీ ఆ కాలంలో కడుపు నిండేందుకే కష్టంగా మారింది. ఆ కాలంలో ఆహారం కోసం మాత్రమే పనిచేసేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు. తమకు వీలైనంత భూమిని వ్యవసాయం చేసేవారు. అప్పుడు వారి వద్ద ఎలాంటి పనిముట్లు లేవు. దీంతో ఒక పంట తీయడానికి సంవత్సరమంతా కష్టపడేవారు. రాను రాను పనిమట్లు అందుబాటులోకి రావడంతో ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. ఆ కాలంలో వరి, పత్తి పంటలు మాత్రమే ప్రధానంగా ఉండేవి. వీటిని పండించడానికి కుటుంబమంతా కష్టపడేది. కాలం మారుతున్న కొద్ది ఎడ్ల బండిని సమకూర్చుకున్నారు. దీని సహాయంతో వ్యవసాయ పనులు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి.
ఎంత టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నా భారత్ లో కట్టుబాట్లు, ఆచారాలు మాత్రం అనాటి నుంచి అలాగే వస్తున్నాయి. ముఖ్యంగా వస్త్రధారణలో ఇప్టటికీ అవే పద్దతులు వాడుతున్నారు. పూర్వకాలంలో భారత్ లోని మహిళలు ఎక్కువగా చీరను ధరించేవారు. చాలా గోచి లా తయారు చేసుకునేవారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొందరు పాటిస్తున్నారు. పురుషుల్లో దోవతిని అలాగే గోచిలాగా పెట్టుకునే వారు. కానీ పైన షర్ట్ ఉండేది కాదు. చిన్న పిల్లలకు అసలే దుస్తులు వేసేవారు కాదు. అమ్మాయి రజస్వల అయిన తరువాత చీరను ధరించేవారు. పట్టణాల్లో ఉండే డబ్బున్నవారు సైతం ఇలాగే ఉండేవారు. కానీ విదేశీయుల మాయలో పడి కొందరు డ్రెస్సులకు అలవాటు పడ్డారు.
ఆహారం విషయంలో భారత్ పురాతన కాలంలో నాణ్యమైనది పండించుకునేవారు. స్వయంగా పండించిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. ఆప్పుడు డబ్బు కోసం కాకుండా ఆహారం కోసం మాత్రమే పనిచేసేవారు. కుటుంబమంతా కలిసి పనిచేయడం ద్వారా కష్ట, సుఖాలు అందరికీ తెలిసేవి. దీంతో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నేటి కాలంలో ఒక్కరు పనిచేస్తే పది మంది కూర్చొని తింటున్నారు. అందుకే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. పురాతన కాలంలో జబ్బుల బారిన పడిన వారు తక్కువ. ఏదైనా అపాయం జరిగితే అడవిలో ఉండే పసరు ద్వారా నయం చేసుకునేవారు.