https://oktelugu.com/

Telugu Serials: అరువు కథలు… అరాకొరా రేటింగ్స్, తెలుగు సీరియల్స్ శవాసనం!

రేటింగ్స్ విషయంలో కార్తీకదీపం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందనే చెప్పాలి. పైగా అది స్టార్ మా సీరియల్ కావడం, ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేయటంతో రేటింగ్స్ విషయంలో టాప్ లో నిలిచింది. కాకపోతే మధ్యలో సీరియల్ ను కిచిడి చేసి, చివరికి ఎండ్ చేశారనుకోండి.

Written By:
  • Shiva
  • , Updated On : July 24, 2023 / 12:21 PM IST

    Telugu Serials

    Follow us on

    Telugu Serials: బుల్లితెర మీద కార్తీకదీపం స్థాయిలో మరో సీరియల్ సక్సెస్ కాలేదనే చెప్పాలి. చిన్న పెద్ద అనే తేడా లేకున్నా వంటలక్క ను, డాక్టర్ బాబు ను ఓన్ చేసుకొని మరి ఆ ధారావాహికను ఆకాశంలో నిలబెట్టారు. అయితే ఆ సీరియల్ తర్వాత మారే సీరియల్ కూడా దాని దరిదాపుల్లోకి రాలేదనే చెప్పాలి. పైగా ఇందులో నటించిన ప్రేమి విశ్వనాథ్ ఆ తర్వాత మరో సీరియల్ లో కనిపించలేదు. ఇక డాక్టర్ బాబు గా నటించిన నిరుపమ్ ఏదో సీరియల్ లో కనిపిస్తున్నాడు కానీ అది అనుకున్న స్థాయిలో లేదని చెప్పాలి.

    రేటింగ్స్ విషయంలో కార్తీకదీపం ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందనే చెప్పాలి. పైగా అది స్టార్ మా సీరియల్ కావడం, ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేయటంతో రేటింగ్స్ విషయంలో టాప్ లో నిలిచింది. కాకపోతే మధ్యలో సీరియల్ ను కిచిడి చేసి, చివరికి ఎండ్ చేశారనుకోండి. ఇక ఇప్పటి విషయానికి వస్తే బ్రహ్మముడి సీరియల్ మాత్రమే కొంచెం మంచి రేటింగ్స్ తెచ్చుకుంటుంది. ఇందులో మానస్ కధానాయకుడు. ఇది బెంగాలీ సీరియల్ గట్ చోరా కు తెలుగు వెర్షన్. ఆ తర్వాత అదే ఛానల్ లో వచ్చే నాగ పంచమి కూడా రెండో స్థానంలో ఉంటుంది. ఇది కూడా బెంగాలీ పాపులర్ సీరియల్ పాంచోమి కి తెలుగు వెర్షన్.

    ఆ తర్వాత మూడో స్థానంలో కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ఉంది. ఇది కూడా స్టార్ మా వాళ్లదే, పైగా ఇది కూడా బెంగాలీ సీరియల్ కి తెలుగు వెర్షన్. దాని పేరు కుసుమ్ డోలా . ఇందులో నటీనటులు తెలుగులో అంత పేరున్న వాళ్ళు కాదు. ఇలా చూసుకుంటే మొదటి మూడు టాప్ సీరియల్స్ బెంగాలీ నుంచి అరువు తెచుకున్నవే కావడం విశేషం. ఈ మూడు కూడా స్టార్ మా వాళ్ళవే కావటం మరో విశేషం. ఇక తర్వాత జీ తెలుగులో వచ్చే త్రినయని, ప్రేమ ఎంత మధురం అనే సీరియల్స్ ఉన్నాయి.

    ఇందులో గమ్మత్తు ఏమిటంటే త్రినయని బెంగాలీ ఫేమస్ సీరియల్ త్రినయనికి రీమేక్, అదే విధంగా ప్రేమ ఎంత మధురం కూడా మరాఠీ సీరియల్ కు తెలుగు వెర్షన్. ఇలా చూసుకుంటే మొదటి టాప్ 5 సీరియల్స్ కూడా పర బాష నుంచి అరువు తెచ్చుకున్న సరుకు అనే చెప్పాలి.. ఎక్కడ కూడా తెలుగుదనం అనేది లేదు. బహుశా అందుకే కావచ్చు సాదాసీదా రేటింగ్స్ తప్ప భారీ స్థాయిలో రేటింగ్స్ రావడం లేదు. ఎంత పరభాష సీరియల్స్ అయిన వాటిని తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయకపోతే కనీస ఆదరణ కూడా కోల్పోయే అవకాశం ఉందని నిర్వాహకులు తెలుసుకుంటే మంచిది.. లేకపోతే ఇలాంటి అరకొర రేటింగ్స్ తోనే కాలం గడపాల్సి వస్తుంది..