National Highways: నేషనల్‌ హైవేకి నంబర్స్‌ ఎలా కేటాయిస్తారు.. ఎవరు కేటాయిస్తారు?

ప్రతీ జాతీయ రహదారికి నంబర్‌ ఉంటుంది. ఈ నంబర్లను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ కేటాయిస్తుంది. దీనికి కొన్న ప్రమాణాలను పాటిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

Written By: Raj Shekar, Updated On : February 25, 2024 2:46 pm

National Highways

Follow us on

National Highways: రోడ్లు దేశ అభివృద్ధికి చిహ్నాలు అంటారు. రహదారులు ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. రవాణా సౌకర్యం ఎంత సౌలభ్యంగా ఉంటే అభివృద్ధి అంత త్వరగా జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తుంటాయి. కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం ఊపందుకుంది. 2014 నాటికి దేశంలో జాతీయ రహదారుల పొడవు 91,287 ఉండగా, 2018 నాటికి వాటి పొడవు 1,42,126 కిలోమీటర్లకు పెరిగింది. అంటే ఐదేళ్లలోనే 50,839 కిలోమీటర్లకు పెంచారు. 2023 నాటికి ఇది మరో 50 వేల కిలోమీటర్లు పెరిగి 2 లక్షల కిలో మీటర్లు దాటింది.

ఎవరు నిర్వహిస్తారు..
ఇక ఈ జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యత పూర్తిగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చూసుకుంటుంది. 1988లో పార్లమెంట్‌ రూపొందించిన చట్టం ప్రకారం ఇది ఏర్పడింది. జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ దీని బాధ్యత. 1995, ఫిబ్రవరిలో అథారిటీకి చైర్మన్, సభ్యులను నియమించారు. ఇక జాతీయ రహదారులకు నంబర్ల కేటాయింపు బాధ్యత కూడా ఈ అథారిటీదే.

నంబర్ల కేటాయింపు ఇలా..
ప్రతీ జాతీయ రహదారికి నంబర్‌ ఉంటుంది. ఈ నంబర్లను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ కేటాయిస్తుంది. దీనికి కొన్న ప్రమాణాలను పాటిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

– దేశానికి ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న జాతీయ రహదారులకు సరి సంఖ్య నంబర్లు కేటాయిస్తుంది. ఆరోహణ క్రమంలో ఉత్తరం నుంచి దక్షిణం వైపు నంబర్లు కేటాయిస్తారు. ఇక తూర్పు నుంచి పడమరకు బేసి సంఖ్యలను కేటాయిస్తారు. తూరు నుంచి పడమరకు ఆరోహణ క్రమంలో నంబర్లు కేటాయిస్తారు. మరో మాటలో చెప్పాలంటే అధిక రేఖాంశాలకు తక్కువ సంఖ్యలు తక్కువ రేఖాంశాలకు అధిక సంఖ్యలు కేటాయిస్తారు. ఎన్‌హెచ్‌–2 ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే.. ఎన్‌హెచ్‌ – 68 రాజస్థాన్‌లో ఉంది. అదే విధంగా ఉత్తరం నుంచి దక్షిణం చూస్తే ఢిల్లీ నుంచి ముంబైని కలిపే ఎన్‌హెచ్‌ –8 నంబర్‌ కేటాయించారు. ఇక ముఖ్యమైన హైవేలకు ఒకటి లేదా రెండు అంకెల సంఖ్యలు కేటాయిస్తారు. మూడు అంకెల సంఖ్యతో సూచించబడే హైవేలను అనుంబంధ రహదారులు అంటారు. 244, 144, 344 జాతీయ రహదారి సంఖ్య 44 హైవే శాఖలు.